ప్రస్తుతం కాలం మారింది మరియు ఆలోచన విధానం మారడం వలన ఎన్నో విషయాలలో కొత్త కోణాలను చూస్తున్నారు. దానివలన ఈ యువతకు కొత్త ప్రత్యేకత లభించింది. జెన్జీ జనరేషన్ లో ప్రతి ఒక్క విషయాన్ని కొత్త కోణంలో చూస్తున్నారు మరియు పాత తరంలో పాటించే పద్ధతులను అస్సలు పట్టించుకోవడం లేదు. సహజంగా ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. జీవితాంతం కలిసి నడవడానికి తోడు, ప్రేమ కచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని భావిస్తారు. అయితే, వీరు మాత్రం ఎంతో స్పష్టంగా పెళ్లి గురించి అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు.
ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తారు. అయితే ఎన్నో విధాలుగా అమ్మాయిలకు నచ్చజెప్పి తల్లిదండ్రులు పెళ్లి చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. పరిస్థితుల ప్రకారం, పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య తక్కువ అయింది. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు వయసు అయిపోతుందని మరియు పరిస్థితుల వలన పెళ్లిళ్లు అస్సలు చేసుకోవడం లేదు. అన్ని విషయాల్లో ఎంతో స్పష్టంగా ఆలోచిస్తూ, తమ నిర్ణయాలను స్వయంగా తీసుకుంటున్నారు మరియు ఆచరణలో కూడా పెడుతున్నారు.
అదేవిధంగా, ప్రేమ మరియు పెళ్లి విషయాలలో కూడా అంతే స్పష్టంగా ఉన్నారు. వయసు పెరిగిందని, సామాజిక కారణాల వలన ఒత్తిడి, బలవంతం వంటి ఇతర కారణాల వలన పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. జీవితంలో పెళ్లి చేసుకుని పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో బాధపడే స్థితిలో ఉండకుండా ఉండటమే వారు కోరుకుంటున్నారు. కేవలం వారికి నచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు మరియు వారికి తగిన భాగస్వామి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటామని చెబుతున్నారు. ఈ విధంగా, పాత ట్రెండ్‌ను ఫాలో అవ్వమని, తమ కలలను స్వయంగా నిర్మించుకోవడానికి ఎవరి అవసరం లేదని, స్వసక్తితో ముందుకు వెళ్తామని ఈ తరం అమ్మాయిలు చెబుతున్నారు.