ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. సహజంగా, ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఎన్నో రకాల చర్యలను తీసుకుంటూ ఉంటారు. అయితే, హైడ్రేటెడ్‌గా ఉండేందుకు మంచినీరుతో పాటుగా మజ్జిగను తీసుకోవడం ఎంతో ఉపయోగమని అందరూ భావిస్తారు. దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నప్పటికీ, కొంతమంది మజ్జిగను తీసుకోవడం అనారోగ్యకారంగా భావిస్తారు. ఎవరైతే లాక్టోస్ అసహనం ఉంటుందో వారు మజ్జిగను తాగకూడదు. ఎప్పుడైతే లాక్టోస్ అసహనం ఉన్నప్పుడు మజ్జిగను తీసుకుంటారో, శరీరం జీర్ణించుకోలేకపోతుంది. అందువలన మజ్జిగను తాగడం వలన కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ మరియు విరోచనాలు వంటి మొదలైన జీర్ణప్రక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
అదేవిధంగా గుండె జబ్బులతో బాధపడేవారు మజ్జిగను తీసుకోకపోవడమే మేలు. ఎందుకంటే, దీనిలో కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దాని వలన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో రక్తకణాలలో కొవ్వు పెరిగిపోతుంది మరియు గుండెకు సంబంధించిన సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. కొంతమంది మజిగలో ఉప్పు కలుపుకొని తాగడానికి ఇష్టపడతారు. ఎవరైతే బీపీ సమస్యతో బాధపడుతున్నారో వారు మజ్జిగను అలా తాగడం వలన ఎంతో ప్రమాదం. కనుక బీపీతో బాధపడేవారు మజ్జిగ తాగేటప్పుడు ఉప్పును తీసుకోకపోవడమే మేలు.
మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు అయితే మజ్జిగను అస్సలు తాగకూడదు. దీనిలో ఉండే టైరమైన్ అనే పదార్థం తలనొప్పిని మరింత ఎక్కువ చేసే ప్రమాదం ఉంది. కొంత శాతం మంది పాల ఉత్పత్తులకు సంబందించిన ఎలర్జీలతో బాధపడతారు. అలాంటి సందర్భంలో, మజ్జిగను తాగడం వలన చర్మం పై దురదలు, దద్దుర్లు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ఇటువంటి సమస్యలతో బాధపడేవారు మజ్జిగను తీసుకోకపోవడమే మేలు అని నిపుణులు చెబుతున్నారు.