నా గురించి తప్పుగా అనుకుంటున్నారేమో” లేదా “నేను చెప్పిన దాని అర్థం అది కాదు!” ఇలాంటి చిన్న అపోహలు లేదా తప్పుడు అంచనాలు ఒక్కోసారి పెద్ద యుద్ధానికి దారి తీయడం మనం చూస్తూనే ఉంటాం. నిజానికి ఈ చిన్న పొరపాట్లు ఒక పెద్ద ఫైట్ గా మారకుండా ఆపేసే బ్రహ్మాస్త్రం మన చేతిలోనే ఉంది. మరి ఆ ఒక్క ట్రిక్ ఏమిటి? అపార్థాల గోడ కూలిపోయి సంబంధాలు నిలబడాలంటే మనం పాటించాల్సిన సులువైన మార్గాలు ఏంటో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
చిన్న అపోహ పెద్ద గొడవగా మారకుండా ఆపేసే ఆ ఒక్క ట్రిక్ ఏంటంటే, వెంటనే వివరణ అడగడం. ఇక్కడ మీరు పాటించాల్సిన మొదటి నియమం ఏమిటంటే ఎదుటివారు మాట్లాడినప్పుడు లేదా ఏదైనా చేసినప్పుడు దాని వెనుక ఉన్న ఉద్దేశం గురించి మీ మనసులో ఏదైనా సందేహం కోపం లేదా బాధ కలిగితే, వెంటనే వారిని ప్రశాంతంగా అడగండి.
“మీరు అలా అన్నప్పుడు చేసినప్పుడు, నాకు కొంచెం బాధ అనిపించింది. అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి?” లేదా “మీరు అలా ఎందుకు చెప్పారో కొంచెం వివరిస్తారా?” అని అడగండి. చాలాసార్లు మనం విన్నదానికి లేదా చూసినదానికి అసలు నిజమైన ఉద్దేశానికి చాలా తేడా ఉంటుంది. మన మనసులో ఊహించుకున్న కథే పెద్ద ఫైట్ కు దారి తీస్తుంది. కాబట్టి, ఊహలకు పోకుండా నిజానిజాలను నిర్ధారించుకోవడమే మొదటి ట్రిక్.

ఈ ట్రిక్ ను ఉపయోగించేటప్పుడు మనం పాటించాల్సిన మరో ముఖ్యమైన విషయం “నేను” అనే పద్ధతిలో మాట్లాడటం. అంటే ఎదుటివారిని నిందించే విధంగా “మీరు ఎప్పుడూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు” అనకుండా “మీరు అలా మాట్లాడినప్పుడు, నాకు కొంచెం నిరాశ అనిపించింది” అని చెప్పండి.
ఇలా మాట్లాడటం వల్ల, ఎదుటివారు గా మారకుండా మీ భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అపార్థం పెద్ద ఫైట్ గా మారకుండా ఉండాలంటే ఆ కోపం, బాధ మొదలైన వెంటనే దానిని నియంత్రించాలి. ఒక చిన్న అపోహ మొదలైనప్పుడు రెండు నిమిషాలు ఆగి, లోతుగా శ్వాస తీసుకుని, ఆ తర్వాత మాత్రమే మాట్లాడటం అనేది రెండో ముఖ్యమైన ట్రిక్. ఎప్పుడూ కూడా కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు, ముఖ్యంగా మాటల రూపంలో.
ముఖ్యంగా అన్నింటికీ మూలమైన సమస్య ఏమిటంటే, మనలో ఒకరి మాట ఒకరు పూర్తిగా వినకపోవడం. చాలామంది ఎదుటివారు మాట్లాడుతుంటే, మధ్యలో తమ సమాధానం గురించి ఆలోచిస్తుంటారు కానీ, వారి మాటను పూర్తిగా అర్థం చేసుకోరు. కాబట్టి ఈ చిన్న అపోహలు పెద్ద గొడవలు కాకుండా ఉండాలంటే, ఆ క్షణంలో నిజాయితీగా వివరణ అడగడం, నిదానంగా మాట్లాడటం మరియు పూర్తిగా వినడం అనే ఈ మూడు మార్గాలను పాటిస్తే సరిపోతుంది.
