యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చెయ్యాలంటే.. ఈ ఆకులను తప్పకుండా తీసుకోవాల్సిందే..!

-

శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, యూరిక్ యాసిడ్‌ను సమతుల్యం చేసుకోవడానికి సరైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఆయుర్వేదం ప్రకారం, కొన్ని రకాల ఆకులను తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే రోజువారి ఆహారంలో మార్పులు చేసుకుంటారో, ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా జీవన విధానం మార్చుకుంటే ఎలాంటి సమస్యనైనా తగ్గించుకోవచ్చు. మీ ఆహారంలో భాగంగా తులసి ఆకులను కచ్చితంగా తీసుకుంటే ఎన్నో ఉపయోగాలను పొందవచ్చు. తులసి ఆకులు తీసుకోవడం వలన కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.

అంతేకాకుండా ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. అంతేకాకుండా యూరిక్ యాసిడ్ కంట్రోల్‌లో ఉంటుంది. అందరికి వేపాకులో ఉండే పోషక విలువలు తెల్సినప్పటికీ, వీటిని ఎక్కువగా తీసుకోరు. అయితే ఆయుర్వేదంలో వేపాకుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, యూరిక్ యాసిడ్‌ను సమతుల్యం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. వంటల్లో కరివేపాకును అందరూ ఉపయోగిస్తారు, కానీ కొంతమంది మాత్రమే తింటారు. కరివేపాకును తీసుకోవడం వలన కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా వీటితో లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఎప్పుడైతే కరివేపాకును తరచుగా తీసుకుంటారో, డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది.

ఆయుర్వేదంలో మంజిష్ట ను కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని తీసుకోవడం వలన రక్తంలో ఉండే అనవసర పదార్థాలు తొలగిపోతాయి. ముఖ్యంగా, యూరిక్ యాసిడ్ సమతుల్యం అవుతుంది. అంతేకాక లివర్ మరియు కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడతాయి. శరీరం నుండి అనవసరమైన టాక్సిన్లను తొలగించడంలో మంజిష్ట ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
యూరిక్ యాసిడ్‌ను సమతుల్యంలో ఉంచుకోవడానికి గుడిచి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అలాగే, కిడ్నీల పనితీరు మరియు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఎంతో సహాయం చేస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news