మన రోజువారి ప్రయాణంలో ఉదయం నిద్రలేస్తూనే బిజీగా గడుపుతాము. మనకోసం కొంత టైం కేటాయించుకొని మన ఆరోగ్యం పై దృష్టి సారించడం ఎంతో అవసరం. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని తాగే అలవాటు ఎంతో మందికి ఉంటుంది. కానీ గోరువెచ్చ నీటిలో ఆవు నెయ్యి ఒక స్పూన్ కలుపుకొని తాగితే శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఉదయాన్నే గోరివెచ్చ నీటిలో నెయ్యి కలుపుకొని తాగితే వచ్చే ప్రయోజనాల గురించి మనము తెలుసుకుందాం..
ఆయుర్వేదంలో నెయ్యి ఒక ఔషధంగా భావిస్తారు. ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ కాఫీ, టీ తాగుతారు కొంతమంది గోరువెచ్చని నీటిని తాగుతారు కానీ ఎప్పుడైనా గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగి చూసారా, ఇది ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం : నెయ్యి లో బ్యూటిరిక్ ఆమ్లం ఉంటుంది ఇది జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాని వృధి చేస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చ నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల పేగులు శుభ్రపడతాయి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణ ఎంజైములను ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం జీర్ణశక్తిని మరింత బలపడేటట్లు చేస్తుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది : నెయ్యిలో విటమిన్ ఏ, డి, ఇ, కె, పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్ లాగా పని చేస్తాయి ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ఉదయాన్నే నెయ్యి తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. సీజనల్ అనారోగ్యాల నుంచి రక్షణ కలుగుతుంది.
చర్మం ఆరోగ్యం: నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాని తేమగా ఉంచుతాయి. జుట్టుని కూడా బలంగా చేస్తాయి ఉదయం నెయ్యి కలిపిన నీరు తాగడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. పొడి మారడం తగ్గుతుంది ఇది చర్మం లోని కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. నెయ్యిలోని విటమిన్లు జుట్టు రాలడాని నివారిస్తాయి.
బరువు నియంత్రణ: ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈరోజుల్లో అందరూ బరువు తగ్గడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు కానీ నెయ్యి బరువు నియంత్రణలో సహాయ పడుతుందని ఎంతో మందికి తెలియదు. ఇది శరీరంలో కొవ్వును కరిగిస్తుంది ఉదయం గోరువెచ్చ నీటిలో నెయ్యి తాగడం వల్ల జీర్ణ క్రియ (మెటబాలిజం) మెరుగుపడుతుంది ఇది క్యాలరీలను సమర్థవంతంగా బర్న్ చేస్తుంది. అలాగని విపరీతంగా నెయ్యి తీసుకోకూడదు కేవలం ఒక టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి.
తయారీ విధానం: ఒక గ్లాస్ గోరువెచ్చ నీటిలో ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిని కలపాలి నెయ్యి పూర్తిగా కరిగే వరకు బాగా కలపాలి. ఖాళీ కడుపుతో ఉదయం ఏ ఆహారం తీసుకోవడానికి ముందే ఈ తాగాలి రుచి కోసం ఒక చిటికెడు తేనెను కలుపుకోవచ్చు.
జాగ్రత్తలు: నెయ్యిని అధికంగా తీసుకోవడం వల్ల క్యాలరీలు పెరిగే అవకాశం ఉంది అందుకే మితంగా వాడాలి. గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు వైద్యుని సంప్రదించిన తర్వాతే ఈ చిట్కాన్ని పాటించాలి. ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి ఇది స్వచ్ఛమైనది మరియు ఆరోగ్యకరమైనది.
గమనిక :(పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వైద్యున్ని సంప్రదించండి.)