మహావతార్ నరసింహ చిత్రం సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే.. ఎవ్వరైనా మంత్రముగ్దులు కావాల్సిందే. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ కి అపారమైన అవగాహన ఉందని చెప్పారు. తనకు తెలిసిన వారిలో కానీ తమ కుటుంబ సభ్యుల్లో కానీ పవన్ కి తెలిసినంతగా సనాతన ధర్మం గురించి ఎవ్వరికీ తెలియదని అన్నారు.
పవన్ కళ్యాణ్ తెలిసినంతగా సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్లు ఇంకెవ్వరూ లేరని చెప్పారు. ఆయన మహావతార్ నరసింహ సినిమా చూడాలని.. ఈ సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే.. కేవలం యానిమేషన్ తో వచ్చిన మహావతార్ నరసింహ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి రూ.79 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించగా.. తెలుగులో అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్ విడుదల చేసింది.