కానుగ నూనెతో సోరియాసిస్ సమస్యకు, ఇంకా ఎన్నో ఇబ్బందులకు పరిష్కారం.!

-

కొంతమందికి చర్మవ్యాధులు వల్ల స్కిన్ పైన పొట్టు రాలటం, దురదలు, మచ్చలు పడటం లాంటవి సోరియాసిస్ వచ్చినవారిలోనూ, ఎగ్జిమా వచ్చినవారిలోనూ, కొంతమందికి డర్మటైటిస్ వచ్చినవారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మనకు లోపల ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ..అంత ఫీల్ అవ్వం కానీ..చర్మం పైన ఇలాంటి సమస్యలు వచ్చేసరికి చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. అందరికీ కనిపించటం ఒక సమస్య అయితే..దురద పెడుతుంది..అసలు ఇలాంటి ప్యాచెస్ ఉంటే..మన పక్కన ఎవరైనా కుర్చోడానికి కూడా ఇష్టపడరు. బాహ్యంగా ఆయింట్ మెంట్స్ రాస్తే..తాత్కాలిక ఉపశమనం వస్తుంది కానీ పూర్తిగా తగ్గదు. మరి ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి నాచురల్గా కొన్ని పద్దతులు ఉన్నాయి. సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన ఆయిల్ గురించి ఈరోజు చూద్దాం.

కానుగ నూనె..గానుగ నూనె అనుకుంటారేమో..కానుగ నూనె (Pongame oil ) మార్కెట్ లో అమ్ముతారు. ఈ నూనె 100 ml 100-150 వరకూ ఉంటుంది. ఈ నూనెను సోరియాసిస్ తో బాధపడేవారు, స్కిన్ డ్రై అవుతున్నవారు, యూవిరేసెస్ వల్ల స్కిన్ దురదలు వస్తాయి అలాంటి వారు అంతా 3ml కానుగ నూనె తీసుకుని 5ml కొబ్బరినూనె తీసుకుని ఈ రెండింటిని కలిపి చర్మం మీద ఎక్కడైతే ప్యాచెస్ వచ్చి రెడ్ గా అయి పొట్టు రాలుతుందో..దురదగా ఉండిన చోట అంతటా ఈ ఆయిల్ ను అప్లై చేయండి. రోజుకు 3-5 సార్లు ఈ ఆయిల్ ను రాసుకోవచ్చు. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే..ఈ కానుగ నూనెలో ఉండో ఫ్లైవనాయిడ్స్ అనేవి..స్కిన్ లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ప్యాచెస్ త్వరగా నార్మల్ అవడానికి, ఇరిటేషన్ తగ్గించడానికి బాగా ఉపయోగడుతున్నదని 2013వ సంవత్సరంలో నార్గండ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ & రీసెర్చ్ సెంటర్( Naragund College Of Pharmacy& Research Center) బెంగుళూరు వారు పరిశోధన చేసి ఇచ్చారు..

ఈ ఆయిల్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

ఈ ఆయిల్ ద్వారా ఇతర లాభాలు ఇంకేమైనా ఉంటాయంటే..కొంతమందికి పైల్స్ వల్ల ఇబ్బందిపడుతుంటారు..దానికి కొద్దిగా కొబ్బరినూనె, కానుగ నూనె రెండు సమపాళ్లలో కలిపేసి వాటిమీద రాస్తుంటే..యాంటిఇన్ఫ్లమెంటరీస్ ప్రొపర్టీస్ ఈ ఆయిల్ లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి..అలాంటివారికి పైల్స్ దగ్గర రాసుకోవడం నొప్పి తగ్గుతుందట.

జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా..నువ్వుల నూనె తీసుకుని, కానుగ నూనె తీసుకుని..గోరువెచ్చగా వేడి చేసి ఆ వేడి నూనెను జాయింట్ మీద రాసి..వేడి నీళ్ల కాపడం పెంటుకుంటే కూడా పెయిన్స్ తగ్గుతున్నాయని కూడా పరిశోధుకులు వెల్లడించారు.

ఈ నూనెను జట్టుకు రాసినప్పుడు హెయిర్ కలర్ మారకుండా నవారించడానికి కొంత ఉపయోగపడుతుందని కూడా అధ్యయనంలో వెల్లడించారు. కేవలం జుట్టుకే కాదు మాడుకు కూడా రాసినప్పుడే..హెయిర్ రూట్ దాకా వెళ్లి..అక్కడ ఉండే స్కిన్ మెలనోసైట్స్ కి ఇన్ఫ్లమేషన్ తగ్గించి త్వరగా తెల్లగా అవకుండా చూస్తుంది.

మార్కెట్ లో ఈ కానుగ నూనె లభిస్తుంది కాబట్టి..మెడికల్ షాపుల్లో ఉంటుంది. తెచ్చుకుని వాడుకోవచ్చు.

ఈ కానుగ నూనె చెట్టుకు ఉండే ఆకులు అయితే..మలబద్ధానికి తొలగించడానికి కూడా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు.

కొన్ని రకాల జబ్బులకు ఆహారనియమాల్లో మార్పు చేయటం ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని రకాల జబ్బులకు బాహ్యంగా ఇలాంటి ఆయిల్స్ అప్లై చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా సోరియాసిస్, ఎగ్జిమా లాంటి సమస్యలు ఉన్నప్పుడు..లోపలికి పండ్లు, మంచి ఆహారపదార్థాలు తీసుకుంటే..ఇంటర్నల్ గా తగ్గుతూ ఉంటుంది కానీ..బాహ్యంగా దురద తగ్గడానికి ఇలాంటి ఆయిల్స్ పనికొస్తాయి. కాబట్టి ఎవరైతే..ఈ సమస్యలతో బాధపడుతున్నారో..ఈ ఆయిల్ తెచ్చుకుని వాడుకోవచ్చు. ఆన్ లైన్ లో కూడా ఇది అందుబాటులో ఉంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news