నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి రోజు అందరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి కూడా మందులుకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాని మన ఇంట్లో ఉండే మనం రోజు ఆహారంలో ఉపయోగించే వాటితోనే ఈ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు చూద్దాం.
ఈ రోజుల్లో ఉన్న ఒత్తిడికి, పని వలన కలిగిన అలసటకి చాలా మందికి విపరీతమైన తలనొప్పి వస్తుంది. అలా ఉన్నప్పుడు ఉల్లిపాయల్ని మెత్తగా నూరి ఆ ముద్దని నుదుటి మీద పెట్టుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉసిరికాయ రసం, నిమ్మరసం, పంచదార కలిపి రోజుకి రెండు లేదా మూడు సార్లు తాగినా ఫలితం ఉంటుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ పని తీరుని మెరుగుపరచడంలో వేప, నేరేడు, మెంతులు, కాకర బాగా పని చేస్తాయి. కాబట్టి ఆయా కాలాలను బట్టి వాటిని రోజు వాడుతూ ఉంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇవన్ని తాజాగా దొరకడం సాధ్యం కాకపోతే ఇవన్నీ విడివిడిగా పౌడర్లు సూపర్ మార్కెట్లో లభ్యమౌతాయి.
వాటిని ఉదయం, రాత్రి ఒక స్పూన్ చొప్పున నీటితో కలిపి తీసుకోవాలి. ఇందులోని యాంటి ఆక్సిడెంట్ ల కారణంగా జుట్టు తెల్లబడటం, చర్మం మీద ముడతలు వంటి వార్ధక్య లక్షణాలను నివారిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ తేనె లో కలిపి తీసుకుంటే జలుబు వదులుతుంది.
ఇలా రోజుకి రెండు, మూడు సార్లు చేయాలి. పది మిరియాల గింజలను మెత్తగా పొడి చేసి నేతితో కలిపి తీసుకుంటే సాధారణ జలుబు, గొంతు నొప్పి, దగ్గు, జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది. చర్మ వ్యాధులు ఉన్నవారు తేనె, దాల్చిన చెక్క పొడి సమానంగా తీసుకుని కలిపి రాస్తే ఫలితం ఉంటుంది.