మామూలు థియేటర్ ల కంటే మల్టీప్లెక్స్ లకి ఇంకా పెద్ద బ్యాడ్ న్యూస్ !

-

కరోనా ప్రభావం లాక్ డౌన్ ఎఫెక్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీని నష్టాల్లోకి నెట్టేసింది. మామూలుగా అయితే సినిమా ఇండస్ట్రీకి వేసవి కాలం మంచి సీజన్. ఈ సీజన్ ని టార్గెట్ చేసుకుని చాలామంది స్టార్ హీరోలు మరియు డైరెక్టర్లు సినిమాలు నిర్మిస్తుంటారు. కానీ కరోనా వైరస్ రాకతో ఈ వేసవికి విడుదల కావాల్సిన సినిమాలు మొత్తం ఆగిపోయాయి. ఈ వైరస్ ఎఫెక్టుతో సినిమాలు నిర్మించిన నిర్మాతలు వడ్డీల మీద వడ్డీలు బ్యాంకులకు కడుతూ అనేక కష్టాలు పడుతున్నారు.Keralites, get ready to book movie tickets online at lesser price ...ఇకపోతే దేశ వ్యాప్తంగా అన్ని థియేటర్లు క్లోజ్ అయిపోవడంతో థియేటర్ వ్యాపారం చేసే వాళ్లు తెగ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన ప్రజలు భయంతో థియేటర్ కు వచ్చే పరిస్థితి లేదు అని మరి కొంతమంది అంటున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ చల్లగా ఉండే ప్రదేశాలలో ప్రభావం గట్టిగా చూపే అవకాశం ఉందని వార్తలు వస్తున్న తరుణంలో మామూలు థియేటర్ల కంటే మల్టీప్లెక్స్ లకి జనాలు వెళ్లే అవకాశం లేదు. దీంతో లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన మామూలు థియేటర్లో రెండు నెలల మరియు మల్టీప్లెక్స్ థియేటర్లు ఆరు నెలల వరకు ఓపెన్ చేయకుండా ఉండాలని చాలా ఇండస్ట్రీల పెద్దలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ విధంగా చేయడం వల్ల రాబోయే రోజుల్లో థియేటర్ వ్యాపారాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతామని అంటున్నారు. ఈ ఏడాది చివరి లోపు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉండటంతో ఇండస్ట్రీ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామంది సమర్ధిస్తున్నారు. మరో పక్క ఆరు నెలలు అంటే లాంగ్ టైం పిరియడ్, దసరా సీజన్ పోతుంది…చాలా పండుగలు మిస్ అయిపోతాం భయంకరమైన లాస్ వస్తుందని మరి కొంతమంది అంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత కూడా ఆరు నెలలు నిజంగా క్లోజింగ్ అయితే ఖచ్చితంగా మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులకు ఇది బ్యాడ్ న్యూసే.

 

Read more RELATED
Recommended to you

Latest news