మీ ఇంటిని ఇలా చేస్తే పాజిటివిటీ, ప్రశాంతత కలుగుతుంది…!

-

ఇప్పుడు చాల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కానీ ఎక్కువసేపు ఇళ్లల్లో కూర్చుంటే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. అలానే ఆఫీస్ లాగ ఇల్లు ఉండకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనా ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే అందంగా ఉండడమే కాక మనస్సు అంత ప్రశాంతంగా, ఆహ్లాదంగా మారుతుంది. పాజివిటీ కూడా ఉంటుంది. అయితే మరి పూర్తిగా ఇప్పుడే వీటి కోసం తెలుసుకోండి.

ఏది ఏమైనా ఇల్లు శుభ్రంగా ఉండాలి. అలా లేకపోతే హాయిగా ఉండదు. ఎదో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ముందు చిందరవందరగా కనిపించే వస్తువులని అన్ని కూడా సర్దేయండి. లేకుంటే మీ ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఫస్ట్ ఇది క్లియర్ చేసేయండి. తీసిన వస్తువుని తీసిన చోట పెడితే అండగా ఉంటుంది గది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇంటిని అందంగా సర్దుకునే మహిళల్లో మానసిక ఒత్తిడిని ప్రేరేపించే ‘కార్టిజోల్‌’ అనే హార్మోన్‌ తక్కువగా ఉత్పత్తి అవుతుందని నిపుణులు వెల్లడించారు.

అలానే రంగులు మన చుట్టూ అందాన్ని, ఆనందాన్ని సృష్టిస్తాయి. ఇంటి గోడలకు, అలంకరణలో మనసుకి నచ్చిన రంగుల్ని ఎంపిక చేసుకుంటే ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి మీ ఇంట్లో ఉండే కలర్స్ పై కూడా మీరు దృష్టి పెట్టండి. ఇది ఇలా ఉండగా మొక్కలు కూడా ఒత్తిడిని దూరం చేయడంలో సహాయ పడతాయి. మనసుకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతాయి. పెరటి మొక్కలు ఇంటి అందాన్ని కూడా పెంచుతాయి. కాబట్టి మొక్కలని కూడా పెంచడం మంచిది. అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్లయితే, కుండీల్లో పెంచుకునే మొక్కలను బాల్కనీల్లో పెట్టేయండి.

ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం అందంగా ఉంచుకోవడం చెయ్యాలి. పాత దుస్తులు, పనికిరాని వస్తువులను ఎక్కువగా పెట్టుకుంటే చిరాకు పెరిగిపోతుంది. ఇంటి అందాన్ని దెబ్బతీయడంతో పాటు బొద్దింకలు, దోమలకు ఆవాసాలుగా మారి లేనిపోని రోగాలు కూడా వ్యాపిస్తాయి. మీకు అవసరం లేనివి లేని వాళ్ళకి ఇస్తే మీకు ఆనందంతో పాటు పాజిటివిటీ వస్తుంది. దానం చేయడంతో సంతృప్తి కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news