ఆరోగ్యానికి ‘తేనె’ఉపయోగాలు …!

-

ప్రపంచంలో పాడవని పదార్ధం ఏదైనా ఉంది అంటే అది తేనె మాత్రమే. తేనె తో పాటు దాల్చిన చెక్క పొడి కలిపి సేవిస్తే రోజు మనం ఎదుర్కునే ఆరోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఏ వ్యాదికైనా తేనెని వాడవచ్చు. షుగర్ పేషెంట్లు మాత్రం వాడకూడదు. తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి క్రమం తప్పకుండా వాడితే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె పోటు రాకుండా కాపాడుతుంది.

రెండు స్పూన్ల దాల్చిన పొడి, 1 స్పూన్ తేనె, ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని వాడితే మూత్రాశయం లో బాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక స్పూన్ తేనె, అర స్పూన్ దాల్చిన పొడి కలిపి మూడు రోజులు సేవిస్తే జలుబు, దగ్గు తగ్గుతుంది. దాల్చిన పొడి, రెండు స్పూన్ల తేనె కలిపి భోజనానికి ముందు సేవిస్తే అజీర్తికి బాగా పనిచేస్తుంది.ఒక స్పూన్ తేనె నోటిలో వేసుకుంటే వ్యాధికారక వైరస్ లను సంహరిస్తాయి.

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కి ముందు, రాత్రి నిద్ర పోయే ముందు ఒక స్పూన్ తేనె, అర స్పూన్ దాల్చిన పొడి, ఒక కప్పు నీటిలో మరిగించి తీసుకోవాలి. ఇలా ప్రతి రోజు సేవిస్తే అధిక బరువుని అదుపులో ఉంచుకోవచ్చు. పొద్దున్నే పళ్ళు శుభ్రం చేసుకున్న తరువాత తేనె, దాల్చిన పొడి కలిపి వేడి నీళ్ళల్లో కలిపి రెండు, మూడు సార్లు నోరు పుక్కిలిస్తే రోజంతా నోరు దుర్వాసన రాదు. ఇంకా తేనె, దాల్చిన పొడి కలిపి సేవిస్తే వినికిడి లోపం తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news