క్యారెట్ తినటం వల్ల ఆరోగ్యానికి ఏ విధంగా మేలు జరుగుతుందంటే..!

-

క్యారెట్లు అంటే అందరికి ఇష్టమే..కానీ ఎప్పుడో ఓ సారి తింటాం కానీ..రోజు తినమంటే నచ్చదు. క్యారెట్ల వల్ల చాలా లాభాలు ఉన్నాయి..ఆరోగ్యంతో పాటు..స్కిన్ కి కూడా క్యారెట్ బాగా హెల్ప్ చేస్తుంది. మనం ఈరోజు క్యారెట్ శరీరానికి ఎంత మేలు చేస్తుందో విపులంగా తెలుసుకుందాం.

ఏ కురకాయను అయినా వండితింటారు..కానీ పచ్చిగా తినమంటే..పెద్దగా ఇష్టపడరు. కానీ క్యారెట్ ను మాత్రం పచ్చిగా తినొచ్చు..దుంపల్లో మంచి దుంప క్యారెట్.

  • ఏ దుంపలు అయినా 100 గ్రాములు తీసుకుంటే సుమారుగా 95- 100 కాలరీల శక్తిని అందిస్తాయి.
  • క్యారెట్ లో కాలరీలు 33 మాత్రమే.
  • ప్రోటీన్ 1 గ్రాము ఉంటుంది.
  • ఫ్యాట్ అసలే ఉండదు.
  • కార్ఫోహై‍డ్రేట్స్ 5.5 గ్రాములు ఉంటాయి.
  • పీచుపదార్థాలు 4 గ్రాములు.
  • బీటాకెరోటీన్ 5423 మైక్రో గ్రామ్స్ ఉంటుంది.
  • మనకు ఒక రోజుకు 2400 మైక్రో గ్రామ్స్ మాత్రమే.
  • మనకు కావాల్సిన దానికంటే డబుల్ లభిస్తుంది. ఇది శరీరంలోకి వెళ్లి విటమిన్ ఏ గా కన్వర్ట్ అవుతుంది.

క్యారెట్ తినటం వల్ల వచ్చే లాభాలు:

క్యారెట్ తినటం వల్ల కళ్లకు మంచిదని చిన్నపిల్లలకు కూడా తెలుసు..మనందరికి చిన్నప్పుడు నుంచి ఇదే విషయం పెద్దోళ్లు చెప్తూనే ఉన్నారు..మనం వింటూనే ఉన్నాం. కంటిలో కలర్స్ ను గుర్తించే కణజాలం ఉంటుంది. అది బాగా పనిచేయాలంటే..విటమిన్ A ఎక్కువగా కావాలి. క్యారెట్ లో ఉండే బీటాకెరోటిన్ ఈ విధంగా కంటికి మేలు చేస్తుంది.

సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ ఇవి ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్ బాగా అవడానికి, ప్రేగులు బాగా క్లీన్ అవడానికి, మలబద్దకం సమస్య రాకుండా ఉండటానికి చాలా మంచిది.

లైకోపిన్, లెక్టిన్, పాలియసైటీలిన్స్ అనేవి ముఖ్యంగా ఉండటం వల్ల యాంటి క్యాన్సర్ గా పనికొస్తాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. క్యారెట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మగవారిలో అధికంగా వచ్చే లంగ్ క్యాన్సర్, ఆడవారిలో ఎక్కువగా వచ్చే బ్రస్ట్ క్యాన్సర్ రాకుండా క్యారెట్ లో ఉండే ఈ కెమికల్ ఎక్కువగా ఉపయోగపడతాయి. ప్రోస్టేడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ రాకుండా కూడా క్యారెట్ మేలు చేస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు.

క్యారెట్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది అని అంటుంటారు కదా..అల్ట్రావైలెట్ రేస్ నుంచి స్కిన్ సెల్స్ ను ప్రొటెక్ట్ చేసి ఆ స్కిన్ సెల్స్ త్వరగా రిపేర్ అయ్యేట్లు, కెమికల్ పొల్యూషన్ త్వరగా క్లీన్ చేసుకునేటట్టు, బాగా గ్లో ఇవ్వడానికి క్యారెట్ బాగా పనికొస్తుంది.

ఆయిల్ స్కిన్ ఉంటుంది కొంతమంది..దాని ద్వారా బాగా మొటిమలు వస్తాయి..ఈ సమస్యను తగ్గించడానికి క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది.

చర్మం పై మచ్చలు ఉంటాయి. పింపుల్స్ వల్ల ఏర్పడతాయి, దోమలు కుట్టినప్పుడు వస్తాయి, కురుపులు వచ్చినప్పుడు కూడా వస్తాయి. ఈ మచ్చలన్నింటిని మంచిగా మానిపించడానికి, స్కిన్ బ్రైట్ నెస్ పెంచడానికి క్యారెట్ జ్యూస్ చక్కగా పనిచేస్తుంది.

అందుకే క్యారెట్ ను పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ గా చెప్పవచ్చు. మనలో ఉండే టాక్సిన్స్ ని, కెమికల్స్ ను, పొల్యూషన్ లాంటివాటిని, వ్యర్థాలను రిమూవ్ చేయడానికి యాంటిఆక్సిడెంట్ చాలా బాగా అవసరం..అందులో విటమిన్ ఏ పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్..క్యారెట్ తీసుకోవటం వల్ల ఇది శరీరానికి బాగా అంది..ఈ పనులన్నీ చేస్తుంది. రక్షణ వ్యవస్థకు కూడా బీటాకెరోటిన్ పనికొస్తుంది.

క్యారెట్ ను వండి తినొచ్చా?

క్యారెట్ ను వండి తిన్నప్పుడు చర్మానికి సంబంధించిన బెనిఫిట్స్ ఎక్కువగా రావు. మైక్రోన్యూట్రియన్స్ కొన్ని దెబ్బతింటాయి. సాధ్యమైనంత వరకూ జ్యూస్ తాగాలి..అయితే కేవలం క్యారెట్ జ్యూస్ తాగమంటే నచ్చదు. దీనికి కాంబినేషన్ ఇస్తే టేస్ట్ కూడా బాగుుంటుంది. క్యారెట్ తో పాటు టమోటా, కీరాదోస, పుదినా లేక కొత్తిమీర కాంబినేషన్ తో జ్యూస్ చేసుకుని కాస్త తేనే, ఎండుకర్జూరం పొడి వేసుకుని తాగితే ఉంటుంది..టేస్ట్ సూపర్ అంతే. పిల్లలకు కూడా ఇలాంటి కాంబినేషన్ ఇవ్వొచ్చు..పిల్లకు క్యారెట్ జ్యూస్ లో దానిమ్మగింజల రసం కూడా వేస్తే..ఈజీగా తాగేస్తారు. క్యారెట్ ను నూనె లేకుండా చేసుకుంటేనే విలువలు బాగా అందుతాయి.

ఘగర్ పేషెంట్స్ దుంపలను తినకూడదు అంటుంటారు. కానీ క్యారెట్ తినొచ్చని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు అంటున్నారు. దుంపకాని దుంప క్యారెట్. కాబట్టి అందరూ క్యారెట్ ను కుదిరినప్పుడల్లా తింటూ ఉంటుంటే..ఆరోగ్యంతో పాటు అందంకూడా మీ సొంతం అవుతుంది. డైలీ క్యారెట్ జ్యూస్ తాగితే..అసలు ఏ క్రీమ్స్ కూడా వాడనక్కర్లా…అంత బాగుంటుందగి మీ స్కిన్. మరీ ట్రై చేసి చూడండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version