ఈరోజుల్లో హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ వాడని వారంటూ ఎవరూ ఉండరేమోకదా..ఇంట్లో మన అమ్మల దగ్గర నుంచి అందరూ వీటికి అలవాటు పడ్డారు. అయితే పెద్దొళ్లు అన్నిసార్లు వీటిని వాడకపోవచ్చు. ఇక స్టూడెంట్స్, జాబ్ చేసే యువత అయితే..బయటకు వస్తే చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టేయడం, మంచి సాంగ్స్ వినేయడం. బస్సుల్లో విండో సీట్ పక్కన కుర్చోని మంచి సాంగ్ పెట్టుకుని, ఫుల్ సౌండ్ పెట్టుకుని వింటుంటే ఆ ఫీల్ భలే ఉంటుందిలే.
కాని ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే వినికిడి శక్తి పోగొట్టుకునే ప్రమాదం ముంది. అది మాకు తెలుసు అనుకుంటున్నారా..కొంతంమందికి..ఎక్కువ సౌండ్ పెట్టుకుని కాసేపు వింటేనే తలనొప్పి వచ్చేస్తుంది. మరికొంతమంది ఎంతసేపు విన్నా ఏం ఇబ్బంది ఫీల్ కారు..అలాంటి ఇదే ధోరణి పాటిస్తుంటారు. కానీ ధీర్ఘకాలిక సమస్యలు వస్తాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం.
70 డెసిబెల్స్కు మించి సౌండ్తో ఆడియో వినకూడదని వరల్డ్ పబ్లిక్ హెల్త్ రిపోర్ట్ చెప్తుంది. అలా చేస్తే భవిష్యత్తులో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ చాలా మంది పిల్లలు, టీనేజీ యువత 85 డెసిబెల్స్తో ఆడియో వింటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ది క్వైట్ మెంబర్ డేనియల్ ఫింక్ చెబుతున్నారు. ఒక రోజులో గంటకు పైగా 85 డెసిబెల్స్ను మించి ఆడియో వినే పిల్లలు, టీనేజీ యువకుల్లో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
85 డెసిబెల్స్ సురక్షితం అని ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొన్నారు. కానీ డేనియల్ ఆ కథానాన్ని సైతం తప్పుపట్టారు, ఇది ఎవరికీ సురక్షితమైన ఎక్స్పోజర్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ 85 డిబిఎ సౌండ్ ఎక్స్పోజర్ లెవల్ను సిఫార్సు చేసినట్లు వాల్స్ట్రీట్ కథనంలో పేర్కొంది. కానీ దీనికి భిన్నంగా డేనియల్ ఫింక్ వ్యాఖ్యలు చేశారు. 70 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ పిల్లలు, యువకులకు అంత సరక్షితం కాదని ఆయన అంటున్నారు. అయితే, ఫ్యాక్టరీలో శబ్ధాల మధ్య పనిచేసే కార్మికులు, లేదా భారీ పరికరాల ఆపరేటర్లకు 85 డెసిబెల్స్ సౌండ్ వరకు ఎటువంటి ప్రమాదం లేదని, ఈ ప్రమాదం చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఉంటుందని ఆయన అంటున్నారు. చిన్నపిల్లల చెవులు చాలా సున్నితంగా ఉంటాయి.. జీవితకాలం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు హెడ్ఫోన్స్, ఇయర్బడ్స్ వాడకాన్ని తగ్గించేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఒకవేళ, ఉపయోగించినా సరే 70 డెసిబెల్స్ కంటే ఎక్కువ స్థాయిలో ఆడియో వినకూడదు. మీరు కూడా అదేపనిగా ఎక్కువ సౌండ్ పెట్టుకుని మ్యూజిక్ వినటం తగ్గిస్తే మంచిది కదా..!