బాదం పాలతో ఎన్ని ప్రయోజనాలో..!

బాదాం నానబెట్టి తినడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయని సంగతి అందరికి తెల్సిందే. అందుకే చాల మంది బాదంలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటారు. పొడి, ఆవు పాలతో తయారు చేసిన బాదం పాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. బాదం పాలు రంగు, రుచితో పాటు మంచి సువాసన కలిగి ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. వీటిలో విటమిన్-ఈ, రిబోప్లేవిన్, విటమిన్-డి, కాపర్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి చాలా రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి బాదం పాలను తాగడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో చూద్దామా.

badam milk
badam milk

అయితే బాదం పాలలో క్యాలరీలు, చెక్కర తక్కువ ఉన్నందున ఇవి ఎంత తాగినా బరువు పెరిగే అవకాశాలు ఉండవు. అంతేకాదు వీటిలో ఎక్కువగా లభించే మోనోస్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. బాదం పాలు బాగా తియ్యగా ఉండవు. ఇక బాదం పాలు తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ మారవు. అందుకనే డయాబెటీస్ ఉన్నవారికి బాదం మిల్క్ మంచి డ్రింక్ అని చెప్పవచ్చు

ఇక బాదం పాలలో అధికంగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్ని ఇవ్వడంతో పాటు, ఫ్రాక్ట్చర్, ఓస్టియోపొరోసిస్ లాంటివి కాకుండా కాపాడుతుంది. ఇక విటమిన్-డి ఎముకలకు కాల్షియం అందించేందుకు బాగా సహాయపడతాయి. బాదం పాలలో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ స్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లాంటి హెల్తీ ఫ్యాట్ అధికంగా లభిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బాదం పాలు తాగడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె పాడవకుండా ఉంటుంది.

బాదంలో ఉండే విటమిన్-ఈ శరీరంలోని కణాలు డ్యామేజ్ అవకుండా కాపాడుతుంది. దీంతో పాటు చర్మంపై మంట లాంటివి రాకుండా కాపాడుతుంది. బాదం పాలలో లభించే విటమిన్-ఈ న్యూరోడిజెనరేటివ్ డిసీజ్ లాంటి అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తుంది. మానసికంగా చురుగ్గా ఉండేందుకు విటమిన్-ఈ బాగా పనిచేస్తుందని స్టడీలు చెబుతున్నాయి. బాదం పాటు సహజంగానే లాక్టోస్-ఫ్రీ.. అందుకనే వీటిని ఎక్కువ మంది తాగడానికి ఇష్టపడుతుంటారు. పాలలోని లాక్టోస్ట్ అరుగుదలకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి లాక్టోస్ లేని బాదం పాలు ఆరోగ్యానికి హాని చేయవని నమ్ముతుంటారు.