పీడకలలు దేనికి ఎందుకు వస్తాయి? ఆరోగ్యానికి కలలకు సంబంధం ఏంటి..?

-

చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు నిద్రపోయే విధానంలో చాలా మార్పులు ఉంటాయి. చిన్నప్పుడు నిద్రపోతుంటే ఎంతసేపు నిద్రపోతావు లే అంటూ కేకలేస్తుంటారు తల్లిదండ్రులు. వయసు మీద పడేకొద్ది నిద్రకు దూరమవుతుంటారు. పెద్దలైతే పడుకొనే ఉంటార కానీ నిద్రపోరు. ఏదోకటి ఆలోచిస్తుంటారు. దీనికి కారణం వారిని వెంటాడే పీడకలలే. దీని గురించి పరిశోధకులు ఏమంటున్నారో చూద్దాం.

రోజంతా కష్టపడి రాత్రి కొంచెం విశ్రాంతి తీసుకుందాని పడుకుంటే ఏవేవో సంబంధం లేని పీడకలు వెంటాడుతుంటాయి. కళ్లు తెరిచేసరికి కొన్ని గుర్తుంటాయి. కొన్నిసార్లు అసలు ఏం కలులు రానట్లు ఉంటుంది. కలలో వచ్చిన నిత్య జీవితంలో కొన్ని జరుగుతుంటాయి. ఇవి ఎప్పుడో జరిగినట్లుగా గుర్తొస్తుంది. అవి ఎప్పుడో కాదు కలలో వచ్చినవే. పీడకలలు రావడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కళలో దగ్గరవాళ్లు చనిపోయినట్లు వస్తుంటాయి. ఇది నిజమవుతుందేమో అని భయపడుతుంటారు. ఆ భయంతో ప్రశాంతతకు దూరం అవుతారు. ఆందోళన, తీవ్ర ఒత్తిడి, కుంగుబాటుకు గురికావచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు.

నిద్రలో వచ్చే పీడకలలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. వీటివల్ల  నిద్రపోవాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. ఇది క్రమేనా నిద్రలేమికి దారితీస్తుంది. ఇటీవల అధ్యయనంలో తేలిందని ఏమిటంటే.. పీడకలలు లేదా చెడుకలలు వల్ల బాధ, కోపం, గందరగోళం, నిరాశ, అపరాధ భావన, అసహ్యం వంటివి ఏర్పడుతాయి. ఓ సంస్థ 351 మంది పెద్దలపై నిర్వహించిన పరిశోధనలో చాలామంది పీడకలలతో బాధపడుతున్నారని, వారిని ఏదో చెడుశక్తి తరుముతున్న భావానికి గురవుతున్నారని తేలింది. ఈ పీడకలలు నిత్యం వెంటాడుతుంటే అవి అనారోగ్యానికి సంతేకాలని భావించాలని పరిశోధకులు తెలుపుతున్నారు. పెద్దల్లో సుమారు 2 నుంచి 8 శాతం మంది ఈ సమస్య వల్ల నిద్రలేమి రాత్రులు గడుపుతున్నారని పేర్కొన్నారు.

ఈ పరిస్థితి ఆర్‌ఈఎం స్లీవ్ బిహేవియర్ డిజార్డర్ అంటారు. ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువగా పీడకలలు వస్తాయి. నిద్రపోగానే తమ చుట్టూ ఏవో తిరుగుతున్నట్లు, భయపెడుతున్నట్లు, భావిస్తారు. కొందరయితే మంచంపై నుంచి ఎగిరి దూకుతారని వివరించారు. రాత్రి వేళల్లో వచ్చే చెడుకలలు వల్ల ఏమవుతుందో తెలియజేయలేదు కానీ, వాటివల్ల కలిగే నిద్రలేమి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఇది క్రమేనా ఒత్తిడికి దారితీసి మనిషిని కుంగదీస్తాయి అని జాసన్ ఎల్లీస్ అనే పరిశోధకుడు తెలిపారు. మీకూ పీడకలలు వస్తుంటే వాటి నుంచి బయటపడండి. జాగ్రత్త వహించండి. వీలైతే మానసిక నిపుణులు సంప్రదించండి.

పాత పద్ధతులు :
– నిద్రంచే ముందు మంచం కింద చెప్పులు, చీపురు కట్ట పెట్టుకుంటే పీడకలలు రాకుండా ఉంటాయి.
– రోజంతా బయట తిరిగి ఇంట్లోకి ప్రవేశించగానే కాళ్లు, చేతులు కడుక్కొని లోపలికి రావాలి. దీంతో చెడు ప్రభావం ఇంట్లోకి ప్రవేశించదు.
టెక్నాలజీ పెరగుతున్న ఈ రోజుల్లో ఈ మూడనమ్మకాలేంటని కొట్టిపారేయకండి. ఇవి చేయడం వల్ల మీ సమయం ఏమి వృథా అవ్వదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version