గుడ్డు పాడైపోయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చెయ్యండి..!

-

గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిది అని డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. అయితే గుడ్డు గురించి మీకు తెలియని కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్. మరి వీటిని అనుసరించేయండి. మీ పనిని మరెంత సులువుగా చేసుకోండి. మరి ఇప్పుడే వీటి గురించి చూసేయండి.

1 నేల మీద గుడ్డు పడితే అనేక ప్రయత్నాలు చేసేస్తూ ఉంటారు. కానీ ఎంతో స్మార్ట్ గా ఇలా చేస్తే మీ పని వేగంగా అయిపోతుంది. ఎప్పుడైనా గుడ్డు నేల మీద పొరపాటున పడితే… సొన కారుతుంది.. మీరు దీనిని బట్టతో మాత్రం తుడవకూడదు. కాస్త ఉప్పుని దాని మీద చల్లాలి. ఇది పూర్తిగా ఆరిపోయాక క్లీన్ చేసేయండి. పని చిటికె లో అయిపోతుంది.

2 గుడ్డు లో ఉండే పచ్చ సొన, తెల్ల సొనని తేలిగ్గా విడతీయాలంటే ఈ టిప్ ని అనుసరించండి. గుడ్డును కొట్టి అందు లోని సొనని పళ్లెం లోకి తీసుకొని పచ్చసొన మీద ఓ గ్లాసు ఉంచి గిన్నె లోకి వంచితే తెల్లసొన గిన్నె లోకి చేరుతుంది.. ఆ పచ్చసొన గ్లాసు కింద ఉండి పోతుంది. ఇలా సింపుల్ గా విడతీయొచ్చు.

3 చేపలు, ఉల్లిపాయల అధిక వాసస వస్తాయి. అందుకే గుడ్లని అక్కడ ఉంచకూడదు. మీరు కనుక ఉంచారంటే గుడ్డు పెంకుకు ఉన్న సూక్ష్మ రంధ్రాల్లోంచి ఆ వాసన లోపలికి వెళ్ళుతుంది.

4 గుడ్డు ఫ్రెష్ గా ఉందొ పాడై పోయిందో తెలుసుకోవాలంటే ఒక గ్లాస్ నీటి లో గుడ్డును వేస్తే నీటిలో తేలితే గుడ్డు పాడయినట్టు. ఒకవేళ అది లోపల ఉంది అంటే ఫ్రెష్ గుడ్డు అని అర్ధం. ఎప్పుడైనా వండే ముందు ఇలా చూసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version