ఈ మధ్యకాలంలో హైపర్ టెన్షన్ తో బాధపడేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. చాలామందికి ఇది మొదటిదశలోనే గుర్తించలేకపోవటం వల్లే కేసు తీవ్రత పెరుగుతుందట. అంటే.. తాము అధిక రక్తపోటు భారిన పడుతున్నాం అని వాళ్లు గ్రహించలేకపోతున్నారు. తీవ్రస్థాయికి చేరినప్పుడే కానీ వైద్యుడి వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ సమస్య వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధ రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. సాధారణంగా ప్రవహించే వేగానికి విరుద్ధంగా రక్తం ప్రవహిస్తుండటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.
అధిక రక్తపోటును గుర్తించటం ఎలా?
వివరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసకభారటం, విపరీతమైన అలసట,
చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ,
తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి.
గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి.
మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావచ్చు.
కళ్లు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు రావచ్చు.
వామ్మో ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయా.. కానీ హైపర్‌టెన్షన్‌ను సులువుగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లతో ఈ సమస్యను నిరోధించవచ్చట
ఎలా నియంత్రించాలి?
రోజు కనీసం 15నిమిషాల పాటైనా వ్యాయామాలను చేయాలి. వాకింగ్ చేయటం వల్ల రక్త పీడనం సాధారణ స్థితిలో ఉంటుంది.
హైబీపీ సమస్య ఉన్నప్పుడు రక్త నాళాల గోడలపై ఒత్తిడిని కలగజేస్తూ రక్తం పంప్ అవుతుంది. దీని వల్ల రక్తనాళాల గోడలు కుచించుకుపోయి.. గుండె జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు 120/80 గా ఉంటే… అయితే హైపర్‌టెన్షన్ సమస్యతో బాధపడేవారిలో ఈ నమోదు 130/90 మి.మీ. అంతకన్నా అధికంగా ఉంటుంది.
ఆహారంలో ఉప్పు తగ్గించడం
సాధారణంగానే ఉప్పును తక్కువగా తీసుకోవటం మంచిది. తీసుకునే ఆహారంలో అవసరమైతే తప్ప, ఒక చిటికెడు ఉప్పును కూడా ఎక్కువగా వేసుకోకండి. ఎక్కువ రుచికోసం ఉప్పుకు బదులుగా నిమ్మరసం, వెల్లుల్లి, మిరియాలు వంటి ఔషధాలను తీసుకోవం మంచిది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం..
వంటల తయారీలో నూనెలు, కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి. మసాలాలు, కారం వాడకాన్ని అదుపులో పెట్టుకోవాలి. నిల్వ పచ్చళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా మానేయాలి. వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా వంటి ట్రాన్స్ క్రొవ్వు పదార్థాలను నిషేధించాలి. శరీరానికి ఒత్తిడి, ఆందోళన కలగకుండా చూసుకోవాలి.
తినాల్సిన పండు..
బంగాళదుంప, నారింజ పండు రసం, అరటిపండు, ఎండుద్రాక్ష వంటి సహజసిద్ధంగా ఎక్కువ పొటాషియంను కలిగి ఉన్న పండ్లను ఎక్కువగా తినండి. విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ, ఆరెంజ్, కివీ, క్రాన్ బెర్రీ, జామ, ద్రాక్ష, స్ట్రా బెర్రీలలో విటమిన్ సి ఉంటుంది. చాలా స్టడీలలో విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుందని నిరూపించబడింది. ఈ పండ్లు పచ్చివిగా లేదా వాటిని రసాలుగా చేసుకుని తాగవచ్చు. అరటిపండులో పొటాషియం ఉంటుంది కాబట్టి ప్రతిరోజూ ఒకటి లేదా రెండు పండ్లు తినటం అలవాటు చేసుకోండి. ఆకుకూరలు కూడా మీ డైట్ లో భాగం చేసుకోవాలి.
వీటితో పాటు మీకు మద్యపానం, ధూమపానం అలవాటు ఉంటే..వెంటనే వాటిని మానేయటానికి ప్రయత్నించండి. ఒకేసారి మానేయటం కష్టం కాబట్టి మెల్లి మెల్లిగా తగ్గించుకుంటూ రావాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించటం ఉత్తమం.