ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి ర్యాబిస్ నుంచి కాపాడుకోండిలా…

-

పెంపుడు జంతువులపై మనుషులకు మమకారం పెరిగిపోయింది. ప్రేమతో పెంచుకునే వారు కొందరైతే సరదా కోసం మరికొందరు. అయితే ఇంట్లో పెంచుకునే కుక్కలకు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయిస్తుండాలి. లేదంటే వాటి వలన ర్యాబిస్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. కుక్కకాటు వల్ల ర్యాబిస్‌ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకితే చికిత్స లేదు.. ముందుగా మేల్కోవడం ఒక్కటే మార్గం. అయితే నేడు ర్యాబిస్‌ అవగాహన దినం. 16వ శతాబ్ధంలో ఇటలీలో ప్రాణాంతక వ్యాధి అయిన ర్యాబిస్‌ను కనుగొన్నారు.

ఇది నరాల్లోకి ప్రవేశించిందంటే 24 గంటల్లో బాధితుడు చనిపోవడం ఖాయం. కుక్కకాటు వల్ల ర్యాబిస్‌ వ్యాధి సోకినవారు నీళ్లు తాగరు. వారికి గాలి పడదు. ఫ్యాన్‌ వేసినా వణికిపోతుంటారు. నోట్లో నుంచి సొంగ కారుతుంది. ఈ లక్షణాలు బయట పడినవారు హైడ్రో ఫోబియా, ఏరో ఫోబియాతో భయపడుతుంటారు. అలాంటివారికి ఇతరులు దూరంగా ఉండాలి. లేకపోతే వారికి కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది.

అలాగే కుక్క కరిచిన గాయాన్ని 15 నిమిషాలపాటు నిరంతరంగా సబ్బు నీటితో శుభ్రపరచాలి. అనంతరం టీటీ ఇంజక్షన్‌ చేయించాలి. వెనువెంటనే యాంటీబయోటిక్స్‌ ఇవ్వాలి. గాయానికి ఎట్టి పరిస్థితుల్లో కట్టుకట్టకూడదు.కొత్తగా వస్తున్న ప్రతి కుక్కకాటు బాధితుడు మొదటి డోసు ఏఆర్‌వీ తీసుకున్నాక, మూడో రోజు, ఏడో రోజు, 28వ రోజు డోసు కూడా తప్పనిసరిగా వేయించుకోవాలని, లేకపోతే ప్రమాదమని వైద్యసిబ్బంది హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news