పీరియడ్స్ సమయంలో చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉంటారు. పీరియడ్స్ సమయంలో వీటిని తీసుకున్నట్లయితే నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆడవాళ్లు పీరియడ్స్ సమయంలో నీళ్లు ఎక్కువ తీసుకోవడం వలన డీహైడ్రేషన్, తలనొప్పి లాంటి ఇబ్బందులు రావు. కాబట్టి సరిపడా నీళ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే బాగుంటుంది. ఈ ఆహారాన్ని తీసుకుంటే మూడ్, డిప్రెషన్ వంటి బాధలు ఉండవు. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా చేపలు వంటి వాటిలో ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోండి.
అలాగే నెలసరి సమయంలో ఆకుకూరలు తీసుకుంటే మంచిది. పాలకూర, కాలే మొదలైన ఆకుకూరలు తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. నీరసం, నొప్పులు లాంటి సమస్యలు ఉండవు. పీరియడ్స్ సమయంలో ఆడవాళ్లు హెల్దీగా ఉండాలంటే పండ్లు తీసుకోవాలి. పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. నెలసరి సమయంలో ఆడవాళ్లు పండ్లు తీసుకుంటే హైడ్రేట్ గా ఉండొచ్చు. పీరియడ్స్ సమయంలో ఐరన్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్ ని తీసుకుంటే కూడా మంచిది.
క్రేవింగ్స్ తగ్గడమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు రావు. పసుపుని తీసుకుంటే కడుపునొప్పి, తిమ్మిరి లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. కనుక పీరియడ్స్ సమయంలో మహిళలు పసుపుని కూడా వాడడం మంచిది డార్క్ చాక్లెట్లు తీసుకుంటే కూడా మహిళలకి ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటుంది PMS లక్షణాలు తగ్గుతాయి. నట్స్ ని కూడా పీరియడ్స్ సమయంలో మహిళలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది సమస్యలు తగ్గుతాయి.