పొట్ట వలన ఇబ్బందిగా ఉంటోందా..? అయితే వీటిని తినాల్సిందే..!

-

చాలామంది పొట్ట కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు కూడా పొట్ట ఎక్కువగా ఉందా..? కరగాలంటే వీటిని తినండి. వీటిని తీసుకోవడం వలన సులువుగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. బీట్రూట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది బీట్రూట్ ని తీసుకోవడం వలన చాలా సమస్యలు తగ్గుతాయి. బీట్రూట్ తో మనం రకరకాల రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు. అలాగే కొవ్వు కరగాలంటే జామ పండ్లను తీసుకోవడం మంచిది. ఇవి పొట్ట చుట్టూ కొవ్వును కరిగించడానికి బాగా హెల్ప్ చేస్తాయి.

కోడిగుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయదు. బరువు తగ్గొచ్చు. అలాగే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది. రెగ్యులర్ గా ఓట్స్ ని తీసుకోవడం వలన ఆకలి వేయదు. బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుంది. బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. పెరుగును తీసుకుంటే కాల్షియం బాగా అందుతుంది.

ప్రోటీన్ కూడా అందుతుంది. కండరాలు హెల్తీగా ఉంటాయి. బెల్లీ ఫ్యాట్ కూడా సులువుగా కరిగిపోతుంది. పొట్ట తగ్గడానికి ఆకుకూరలని కూడా తీసుకోండి. ఆకుకూరల్లో విటమిన్ కె ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన కొవ్వు సులువుగా కరుగుతుంది. ప్రతిరోజు అరగంట పాటు వాకింగ్ చేస్తే బరువు తగ్గడమే కాకుండా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది ఇలా ఈజీగా బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news