మీ నాలుక రంగుని బట్టీ.. మీరెంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసుకోండి.. ఈ రంగులో ఉంటే ప్రమాదమే..!

-

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉన్నామో లేదో అనేది కూడా చెక్ చేయించుకుంటూ ఉంటారు. మీరు కూడా ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇలా తెలుసుకోవచ్చు. మీ నాలుక రంగును బట్టి మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేది తెలుసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండే వారి నాలుక పింక్ కలర్ లో ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు కారణాల వలన నాలుక రంగు మారుతూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి నాలుక ఎప్పుడు కూడా లేత గులాబీ రంగులో ఉంటుంది. దాని మీద తెల్లటి పొర ఉంటుంది. ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని అర్థం.

నీలం రంగులో నాలుక

నీలం రంగులో కనుక నాలుక ఉన్నట్లయితే కార్డియాక్ సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. గుండె ఆరోగ్యంగా లేకపోవడం, రక్త సరఫరా చేయడానికి గుండె ఇబ్బంది పడడం వంటి సమయాల్లో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి నాలుక రంగు నీలం రంగులోకి మారుతుంది.

నల్లటి రంగులో నాలుక

అదే మీ నాలుక నల్లటి రంగులో మారినట్లయితే కచ్చితంగా ప్రమాదం అని తెలుసుకోండి. అల్సర్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన రావచ్చు. లేదంటే ప్రమాదకరమైన క్యాన్సర్ వంటి సమస్యల వలన కూడా నల్లగా మారొచ్చు.

పసుపు రంగులో నాలుక

నాలుక కనుక పసుపు రంగులో ఉన్నట్లయితే విటమిన్ లోపం కలిగిందని అర్థం చేసుకోవాలి. అజీర్తి సమస్యలు ఉంటే కూడా నాలుక పసుపు రంగులోకి మారుతుంది. ఉదర సంబంధిత సమస్యలు లివర్ సమస్యలు ఉంటే కూడా నాలుగు పసుపు రంగులోకి మారుతుంది.

తెల్లటి నాలుక

పూర్తిగా తెల్లగా ఉంటే డిహైడ్రేషన్ సమస్య ఉందని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే స్మోకింగ్ చేయడం వలన కలిగి ఉండొచ్చు. ఒకవేళ నాలుక తెల్లగా ఉన్నట్లయితే నీళ్లు ఎక్కువగా తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news