ఒక్కోసారి మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ వాటిని ఆలస్యంగా గుర్తిస్తూ ఉంటాము. కొన్ని అనారోగ్య సమస్యల్ని నాలుకను చూసి చెప్పవచ్చు. నాలుకని ఆరోగ్య సూచకంగా పరిగణించవచ్చు, ఎందుకంటే మనకు ఉన్న ఆరోగ్య సమస్యల ఆధారంగా నాలుక రంగు మారుతూ ఉంటుంది. అందుకే డాక్టర్లు మొదటగా నాలుకను పరిశీలిస్తారు. నాలుక మీద ఏదైనా కోటింగ్ లాంటిది ఉంటే, జీర్ణ సమస్యలు ఉన్నట్లు అర్థం. పసుపు రంగులో కనిపిస్తే, లివర్ సంబంధిత సమస్యల సూచనగా పరిగణించాలి.
ఒకవేళ నాలుకపై కోటింగ్ లేకుండా మృదువుగా, స్మూత్‌గా కనిపిస్తే, ఇది పోషకాహార లోపానికి సంకేతం. అలాగే నాలుక మందంగా, కొంచెం తెల్లగా మెరుస్తూ ఉంటే రక్తహీనత ఉండవచ్చని భావించాలి. కొన్ని సందర్భాల్లో ఇది గుండె సమస్యల సంకేతంగా కూడా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎలర్జీలు, థైరాయిడ్ అసమతుల్యత కూడా నాలుక మీద ప్రభావం చూపుతాయి.
నాలుక మీద గీతలు, చారలు కనిపిస్తే శరీరంలో ఏదో సమస్య ఉన్నట్లు అర్థం. అలాంటి సందర్భాల్లో ఎక్కువ నీరు తాగాలి. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు నాలుక తెల్లగా, నిశ్రేణిగా మారుతుంది. దీని వలన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాలుక ఆధారంగా మన ఆరోగ్యాన్ని సులభంగా ముందుగా అంచనా వేయవచ్చు కనుక దీన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం