చేతి గోర్లతో మీ సమస్యలని ఇలా గుర్తించేయండి…!

మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలంటే..? సులువుగా మన గోర్లని చూసి మనం చెప్పుకోవచ్చు. అదేమిటి గొర్లకి ఆరోగ్యానికి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా…? ఇది నిజం అండి. మన ఆరోగ్యం ఎలా ఉందో మన గోర్లని చూసి చెప్పొచ్చు, అయితే మన చేతి గోర్ల తీరుని బట్టి మనలో ఉన్న లోపాలను ఎలా తెలుసుకోవచ్చో చూసేయండి. కొందరి చేతి వేలి గోర్ల పై అర్ధ చంద్రాకారం లో ఒక ఆకారం ఉంటుంది. అయితే ఇలా ఉండే అర్ధ చంద్రాకారంని మనం లునులా అంటారు.

nails

లునులా కి అర్ధం స్మాల్ మూన్ అని. మీ గోర్లని ఒకసారి మీరు పరిశీలించి చూస్తే… గోర్ల మీద ఉండే ఈ లునులా మన శరీరం లో ఉన్న అత్యంత సున్నిత మైన భాగాల్లో ఒకటి. ఒకవేళ లూనులా కనుక దెబ్బతింది అంటే ఇక గోరు పెరగదు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు లూనులతో ఆరోగ్యాన్ని ఎలా ఇండికేట్ చెయ్యొచ్చు…? ఈ విషయానికి వస్తే… లునులా ఆకారం మరీ చిన్నగా గుర్తు పట్టలేనట్లుగా ఉంటే… వారు అజీర్తి వ్యాధితో బాధ పడుతున్నారని.. వారి శరీరం లో విష, వ్యర్ధ పదార్ధాలు ఉన్నాయని …

అదే చేతి గోర్ల పై లునులా లేకపోతే.. వారిలో రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఉన్నాయని అర్ధం. అదే ఎరుపు, పసుపు రంగులో మచ్చలు ఉంటే వారికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్టు. లునులా రంగు నీలం లేదా పూర్తి స్థాయిలో తెలుపు ఉంటే వారు త్వరలో షుగర్ వ్యాధి బాధితులు అయ్యే అవాకాశం ఉన్నట్టు. ఇలా మీ ఆరోగ్య సమస్యలని తెలుసుకోవచ్చు.

.