జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర ఏళ్ళు అవుతుంది. అంటే సగం సమయం అయిపోయింది. ఇంకా రెండేళ్లలో ఏపీలో ఎన్నికల సందడి మొదలువుతుంది. అయితే జగన్ మళ్ళీ అధికారంలోకి రావడానికి రాబోయే రెండేళ్లే కీలకమని చెప్పొచ్చు. అంటే ఈ రెండేళ్లలో మరింతగా ప్రజలని ఆకట్టుకునే మళ్ళీ జగన్ గెలవగలుగుతారు…లేదంటే బాబు మాదిరిగా బొక్కబోర్లా పడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే 2014లో బాబు అధికారంలోకి వచ్చినప్పుడు కాస్త మంచిగానే పాలన చేసినట్లు కనిపించింది. కానీ తర్వాత నుంచి అసలు రచ్చ మొదలైంది. ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకం నిదానంగా పోతూ వచ్చింది. అలాగే టిడిపి నాయకుల అవినీతి ఎక్కువైంది. ఇక ప్రజల సమస్యలు బాబు తెలుసులేకపోయారు. ఎక్కడకక్కడ నాయకులు బాబుకు భజన చేయడంతో అసలు నిజాలు తెలియలేదు. అభివృద్ధి ఏమో గ్రాఫిక్స్‌లో చూపించారు. ఎన్నికల్లో గెలవడం కోసం సంక్షేమ పథకాలని అమలు చేశారు. ఇచ్చిన హామీలని పూర్తిగా నిలబెట్టుకోలేకపోయారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు.
అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మొదట నుంచి ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. చెప్పిన సమయానికి చెప్పినట్లు పథకాలు ఇస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి గానీ కాస్త అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఫోకస్ పెట్టాల్సి ఉంది.
రాబోయే రెండేళ్ళు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలని ఒకే ప్రాధాన్యతతో అమలు చేయాల్సి ఉంటుంది. అటు సొంత నాయకుల అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టాల్సి ఉంది. అలాగే ఎమ్మెల్యేలు ఇంకా ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంది. ప్రజలకు ఇంకా అండగా ఉండాలి. భజన చేసే నాయకులని పక్కనబెట్టాలి. వాస్తవ పరిస్తితులని తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ హాఫ్‌లో కాస్త అటూ ఇటైనా సెకండాఫ్‌లో మాత్రం జగన్ దూకుడు పెంచాలి అప్పుడే 2024 ఎన్నికల్లో హిట్ అవుతారు…లేదంటే బాబు పరిస్తితే ఎదురవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.