ఈ ఉప్పుతో స్నానం చేస్తే.. ఒత్తిడి మటుమాయం..! ఇంకా చాలా..

అలిసిపోయిన శరీరానికి వేడినీటి స్నానం తిరిగి ప్రాణం పోస్తుంది. చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. అదే స్నానం చేసేప్పుడు బాత్‌ సాల్ట్‌ను కలుపుకుని చేస్తే..ఆ మజా ఇంకా వేరు. ఇలా చేయడం వల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. బాత్‌ సాల్ట్‌ ఏంటి అసలు స్పెషల్‌గా ఉంటుందా..?ఉప్పునీరు స్కిన్‌కు మంచిది కాదంటారు కదా..! మరి బాత్‌ సాల్ట్‌ ఎలా మంచిది..? ఇందులో ఏంటి స్పెషల్..?

బాత్ సాల్ట్ అంటే..

బాత్ సాల్ట్ అనేవి ఖనిజాలు కలిసిన ఉప్పు. దీన్ని కేవలం స్నానానికి మాత్రమే ఉపయోగిస్తారట. ఇప్పుడు చాలా రకాల ఉప్పులు మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిల్లో ముఖ్యమైనది మాత్రం ‘ఇప్సం బాత్ సాల్ట్’. ఈ ఉప్పు శరీరానికి, చర్మానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. హిమాలయన్ బాత్ సాల్ట్, డెడ్ సీ బాత్ సాల్ట్… ఇలా చాలా రకాల స్నానపు ఉప్పులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

బాత్ సాల్ట్‌తో చేయడం వల్ల ఉపయోగాలు…

ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుచడంతో పాటూ కండరాలకు విశ్రాంతినిస్తుంది.

చర్మ ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.

చర్మాన్ని తేమవంతంగా ఉంచుతాయి. చర్మం పొడిబారే సమస్య ఉన్నవారికి ఈ బాత్ సాల్ట్ లు చాలా మేలు చేస్తాయి. సొరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులు ఉన్న వారికి ఈ ఉప్పు స్నానం ఎంతో మేలు.

చాలా మందిలో బాత్ సాల్ట్ బరువు తగ్గుతారనే అపోహ ఉంది. అది పూర్తిగా అబద్ధం. ఇది బరువు తగ్గేందుకు ఏమాత్రం సహకరించారు. కానీ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. సమతుల్య ఆహారం, శారీరక శ్రమ ద్వారానే బరువు నిర్వహణను చేపట్టాలి.

స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్‌ చేసేందుకు సహాయపడుతుంది. అంటే మృతకణాలను చర్మం మీద నుంచే తొలగించే ప్రక్రియ. చర్మంపై పడే దుమ్ము, ధూళి, నూనెలు, మలినాలు అన్నింటినీ ఈ స్నానం తొలగించేస్తుంది. అలాగే అంటు వ్యాధులు, అలెర్జీలు దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

బాత్ సాల్ట్ లలో మెగ్నీషియం ఉంటుంది. ఇది శరీరంలోని వాపు, మంటలు, నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది.

బాత్ సాల్ట్ కలిపిన నీళ్లలో మీ పాదాలను కొన్ని నిమిషాల పాటూ ఉంచితే చాలా మంచిది. పాదాల ఇన్ఫెక్షన్లు పోతాయి.

ఆర్ధరైటిస్ ఉన్న వారికి ఈ బాత్ సాల్ట్ చాలా ఉపయోగం. అలాగే జాయింట్ నొప్పులను కూడా తగ్గిస్తుంది.

ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి.. ఉపయోగం అనిపిస్తే మీరు వాడిచూడండి.!