రాత్రిళ్ళు తొందరగా నిద్ర పట్టాలంటే.. ఇలా చేయండి..!

-

రాత్రిళ్ళు కొంత మంది నిద్రపో లేక పోతు ఉంటారు. ఎంత ట్రై చేసినా కూడా నిద్ర రాదు. అలా కాకుండా సులభంగా నిద్ర పోవాలంటే వీటిని పాటించండి. ఇలా కనుక చేసారంటే ఈజీగా మీరు నిద్రలోకి వెళ్లి పోతారు. నిద్ర బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని గుర్తు పెట్టుకోండి. రోజు ఎనిమిది గంటల సేపు కచ్చితంగా నిద్రపోయేటట్టు చూసుకోండి.

మంచి నిద్ర వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది రాత్రిపూట బాగా నిద్ర పట్టాలంటే మధ్యాహ్నం పూట నిద్రపోకండి. మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉంటే కచ్చితంగా రాత్రి బాగా నిద్ర పడుతుంది. అలానే రాత్రిపూట మెలకువ వస్తే టైం ఎంత అయింది అనేది చూడకండి దీని వలన మళ్లీ మీకు నిద్ర పట్టదు. వ్యాయామం చేయడం వలన నిద్ర బాగా పడుతుంది కాబట్టి రోజు లో కొంత సమయాన్ని వ్యాయామం కోసం వెచ్చించండి.

స్లీపింగ్ షెడ్యూల్ పాటించడం వలన కూడా నిద్ర సమస్యలు ఉండవు రాత్రిళ్ళు కాఫీ ని తీసుకుంటే కూడా నిద్ర పట్టదు రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే మ్యూజిక్ వినండి. మ్యూజిక్ రిలాక్సింగ్ గా ఉంచుతుంది మిమ్మల్ని. యోగ, మెడిటేషన్ చేయడం వలన కూడా మంచి నిద్ర ని పొందవచ్చు రాత్రిళ్ళు నిద్ర పట్టక పోతే పుస్తకం చదవండి. వెంటనే నిద్ర వస్తుంది ఇలా రాత్రులు నిద్ర పట్టక పోతే వీటిని పాటించండి అప్పుడు కచ్చితంగా మంచి నిద్ర ని పొందొచ్చు. మంచి నిద్ర తో ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news