అన్నం తినేటపుడు నీళ్ళు తాగవచ్చా? ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారు..?

-

మన అలవాట్లే మన జీవితాలని నిర్దేశిస్తాయి. మనం ఎలాంటి అలవాట్లు అలవర్చుకుంటామో వాటివల్లే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే మన అలవాట్లు బాగుండాలి. రోజువారి చేసే దినచర్య ఆరోగ్యకరంగా ఉంటే జీవితం కూడా ఆరోగ్యకరంగా మారుతుంది. ఐతే రోజువారి దినచర్యలో మనం చాలా తప్పులు చేస్తుంటాం. ఇలా చేయడం కరెక్టా కాదా అన్న సందేహాలు తలెత్తుతాయి. అలా తలెత్తే సందేహాల్లో ఒకానొకటి, అన్నం తినేటపుడు నీళ్ళు తాగొచ్చా లేదా అనేది. అవును. చాలా మందికి ఇదొక ప్రశ్నగానే మిగిలింది.

కొందరేమో అన్నం తినేటపుడు నీళ్ళు తాగొద్దని చెబుతారు. మరి కొందరేమో తిన్నాక తాగొద్దని చెబుతారు. ఇంకొందరు తినక ముందు తాగాలని చెబుతారు. మరి వీటన్నింటిలో ఏది కరెక్టో ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. కొందరు ఆయుర్వేద నిపుణుల ప్రకారం అన్నం తినేముందు నీళ్ళు తాగొద్దట. దానివల్ల బలహీనత పెరుగుతుందని అంటున్నారు. అలాగే తిన్న తర్వాత నీళ్ళు తాగితే ఊబకాయం పెరిగే అవకాశం ఉంది. అంటే బరువు పెరుగుతారన్నమాట.

అందుకే అన్నం తినేటపుడు కొద్ది కొద్దిగా నీళ్ళు తాగడం మంచిదని చెబుతున్నారు. ఇలా చేస్తే ఆహారానికి బ్రేక్ వేస్తూ తొందరగా జీర్ణం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఐతే గోరువెచ్చని నీళ్ళు తాగడం మంచిది. ఎందుకంటే, జీవక్రియ మెరుగవడంతో పాటు తొందరగా జీర్ణం అవుతుంది. చల్లని నీళ్ళు అస్సలు తాగవద్దు. చల్లని నీళ్ళు ఆరోగ్యానికి అంతగా మంచివి కావు. ఆహారం తొందరగా జీర్ణం కావాలంటే, జీర్ణక్రియ మెరుగ్గా జరగడానికి మరుగుతున్న నీళ్ళలో అల్లం, సోంపు విత్తనాలని వేసి, కొద్దిగా చల్లారబెట్టుకుని తాగితే బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version