పంటి నుండి రక్తం వస్తోందా..? అయితే ఈ టిప్స్ మీకోసం..!

-

పళ్ళు ముత్యాల్లా మెరుస్తూ ఉంటే ముఖం ఎంతో అందంగా కనపడుతుంది. కానీ తప్పుడు ఆహారపు అలవాట్లు వల్ల మరియు క్లీనింగ్ సరిగా చేసుకోకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి సమస్యల్లో ఒకటి నుండి రక్తం కారడం ఒక పెద్ద సమస్య. దంతాలు బలహీనంగా మారడం వల్ల చిగుళ్ల నుండి రక్తం వస్తుంది. దాని నుంచి ఎలా విముక్తి పొందాలి?

స్మోకింగ్ ను తగ్గించాలి:

స్మోకింగ్ వల్ల మరియు పొగాకు వల్ల దంతాలకు మరిన్ని ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి వీలైనంత వరకూ స్మోకింగ్ కు దూరంగా ఉండండి.

జామకాయ:

జామకాయ పైన కొద్దిగా ఉప్పు వేసుకుని తినడం వల్ల చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది మరియు దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి. దానికి కారణం అందులో ఉండే విటమిన్ సి.

ఉప్పునీరు:

ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో చిటికెడు ఉప్పు వేసి నోటిని ఆ నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మీ దంత సమస్యలు తొలిగిపోతాయి. అదే మీ సమస్య ఎక్కువగా ఉంటే రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల పంటి నొప్పి తో పాటు దుర్వాసన కూడా తగ్గుతుంది.

ఆవనూనె :

కొద్దిగా ఆవనూనె తీసుకుని దానికి చిటికెడు ఉప్పు జోడించి పంటికి అప్లై చేయడం వల్ల పళ్ళు దృఢంగా అవుతాయి మరియు చిగుళ్ల నుండి రక్తం కారకుండా రాకుండా ఉంటుంది. కాబట్టి పంటి నుండి రక్తం వస్తుంటే ఈ టిప్స్ ను ఖచ్చితంగా పాటించండి, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version