చైనా టియాన్ జిన్ SCO శిఖరాగ్ర సదస్సు అనంతరం ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో ప్రయాణించారు. ద్వైపాక్షిక సమావేశ ప్రదేశానికి ఇలా వీరిద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలకు చెక్ పెట్టేందుకు పరస్పర సహకారంపై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. SCO సదస్సులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. కాగా మోదీ, పుతిన్ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.

ఇరువురు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరికీ ఇంగ్లీష్ వచ్చినప్పటికీ వారి మాతృభాషలో మాట్లాడడానికి ఆసక్తి చూపించడం విశేషంగా మారింది. ఇదే సంఘటన చైనాలో కూడా జరిగింది. అందుకే వారి చుట్టూ ట్రాన్స్ లేటర్లు ప్రదక్షిణలు చేస్తూ కనిపించారు. వారికి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఒకరి మాటలను మరొకరికి అర్థమయ్యేలా స్పష్టంగా వివరించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.