వేడిని తట్టుకోవాలంటే వేసవిలో వీటిని తీసుకుంటే మంచిది..!

-

వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి సమయంలో ఆ హీట్ ని తట్టుకునే చల్లటి పదార్థాలను తీసుకోవాలి. ఎండ వేడి ఎక్కువగా ఉండడం వల్ల హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. పైగా ఎండాకాలంలో మసాలా ఎక్కువ వేసిన ఆహార పదార్ధాలని, ఫాస్ట్ ఫుడ్స్ ని తీసుకోవడం కంటే కూడా చలవ చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.

 

నిజానికి ఎండ వేడిని తట్టుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు మనకు సహాయం చేస్తాయి. వాటిని కనుక డైట్ లో తీసుకుంటే సమస్య ఉండదు. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వాటి కోసం చూసేద్దాం.

పుచ్చకాయ:

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పుచ్చకాయ తినడం వల్ల క్యాన్సర్, హైబీపీ, హృదయ సంబంధిత సమస్యలు ఉండవు. బరువు తగ్గడానికి కూడా పుచ్చకాయ సహాయం చేస్తుంది. పుచ్చకాయ తో చాలా రకాల రెసిపీస్ మనం తయారు చేసుకోవచ్చు. దీనిని ఎండకాలంలో తీసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది.

పెరుగు:

పెరుగులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మీరు వేసవికాలంలో పెరుగును కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అజీర్తి వంటి సమస్యల్ని కలగకుండా చేస్తుంది.

కొబ్బరి నీళ్ళు:

కొబ్బరి నీళ్ళు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి అలానే ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటే కూడా మంచిది.

సబ్జా:

సబ్జా గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాన్స్టిపేషన్ వంటి సమస్యలు ఉండవు. సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి వాటిని తీసుకుంటే సమస్యలు వుండవు. వేడి కూడా చెయ్యదు.

టమాటా:

టమాటా కూడా వేసవికాలంలో మీకు బాగా పనిచేస్తుంది టమాట వల్ల చాలా లాభాలు ఉంటాయి. కాబట్టి వేసవిలో దీనిని కూడా తీసుకుంటూ ఉండండి దీనితో మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అలానే సమస్యలు కూడా ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news