లావు తగ్గడానికి సర్జరీ వెళ్తున్నారా…. ఎముకలు జాగ్రత్త..

-

అందంగా కనబడాలని అందరికీ ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడానికి ఇష్టపడతారు. కొంచెం లావు పెరిగినా అమ్మో లావైపోతున్నానని బాధపడుతుంటారు. అందాన్ని తగ్గించడంలో లావు పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఐతే చాలామంది ఒకానొక వయస్సుకి వచ్చిన తర్వాత లావుగా తయారవుతారు. ఆహార అలవాట్ల వల్లనో, మరో కారణం వల్లనో లావయిపోతారు. ఎంత తగ్గాలని ప్రయత్నించినా వారు లావు తగ్గరు. చాలా మంది కుటుంబ బాధ్యతల్లో పడి లావు గురించి పట్టించుకోరు. కానీ లావుగా ఉన్నానని ఫీల్ అవుతూ ఉంటారు.

వంశపారం పర్యంగా వచ్చే జన్యు కారణాల వల్ల కూడా వాళ్ళు లావు తగ్గకపోవచ్చు. అలాంటప్పుడు చాలా మంది సర్జరీలకి వెళ్తుంటారు. ఐతే సర్జరీలకి వెళ్లేముందు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బేరియాట్రిక్ సర్జరీల్లో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే సర్జరీ ద్వారా లావు తగ్గినట్లయితే మీ ఎముకల మీద ప్రభావం చూపుతుంది. ఈ ప్రాసెస్ ద్వారా సర్జరీ చేసుకుని సన్నగా మారితే మీ ఎముకలు బలహీనం అయ్యే అవకాశం ఉందని తాజా అధ్యయనం చెబుతుంది.

ఈ ప్రాసెస్ లో జీర్ణక్రియ మీద ప్రభావం చూపి లావు తగ్గేలా చేస్తుంది. దీని కారణంగా ఎముకలు బలహీనపడి విరిగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా యవ్వనంలోకి అడుగుపెట్టేవారిలో ఈ సమస్య అధికంగా ఉందని తేలింది. ఈప్రాసెస్ కారణంగా ఎముక మూలుగు కొవ్వు పెరగడమే కాకుండా ఎముక సాంద్రత బాగా తగ్గుతుందని తేలింది. అందువల్ల ఇలాంటి ప్రాసెస్ ద్వారా లావు తగ్గాలని యవ్వనంలోకి అడుగుపెట్టే వాళ్ళు ఆలోచించకూడదని సలహా ఇస్తున్నారు. సర్జరీల ద్వారా కాకుండా వ్యాయామం చేయడం ఉత్తమం అని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news