ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఒక అద్భుతమైన పానీయం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని మీకు తెలుసా? అదే జీలకర్ర వాము వాటర్..ఇది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కొత్త శక్తిని ఇచ్చే సహజౌషధం. శరీరాన్ని తేలికగా, జీర్ణక్రియను చక్కగా ఉంచుతూ, అనేక చిన్నచిన్న సమస్యలనుంచి ఉపశమనం కలిగించే ఈ డ్రింక్ మన ఇంట్లోనే కాసేపు సమయం కేటాయిస్తే సిద్ధం చేసుకోవచ్చు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో శక్తివంతమైన పానీయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..
జీలకర్ర, వాము వాటర్ ప్రయోజనాలు: జీలకర్ర మరియు వాము కలిపి తయారుచేసిన ఈ వాటర్ మన ఆరోగ్యానికి ఒక అద్భుతమైన శక్తిని అందిస్తుంది. ఇందులో అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. జీలకర్రలో ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, క్యాల్షియం ఉంటాయి ఇవి జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. వాములో ఉండే థైమోల్ అనే పదార్థం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని బాక్టీరియా ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
ఇక అంతేకాక ఈ డ్రింక్ శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. జీలకర్రలో ఉండే ప్రత్యేకమైన యాంటీ యాక్సిడేట్లు శరీరంలో ఉన్న కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇక జీలకర్ర ఎంజైములను విడుదల చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. వాము గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది మంచి పరిష్కారం.

ఈ వాటర్ రోజు తాగడం అలవాటు చేసుకుంటే శరీరంలోని విష పదార్థాలు బయటికి పంపుతుంది కిడ్నీ లివర్ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇక వాము ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఇది ఆస్తమా వంటి శ్వాస కోసం సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఈ వాటర్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని జలుబు, ఫ్లూ వంటి వాటి నుంచి రక్షిస్తాయి.
తయారీ విధానం: ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ వాము వేసి ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని వడగట్టి పరగడుపున త్రాగండి. ఇలా నానబెట్టడం కుదరకపోతే వాటిని ఒక గిన్నెలో వేసి ఐదు నుంచి పది నిమిషాలు మరిగించి అప్పటికప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగవచ్చు. ఈ వాటర్ రోజు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.