కరోనా విషయంలో కనీస జాగ్రత్తలు…!

-

ఇన్ని రోజులు చైనాకు మాత్రమే పరిమితం అయిన కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ లో అడుగు పెట్టింది. ఇన్నాళ్ళు భయపడని ప్రజలు ఇప్పుడు కరోనా పేరు వింటే చాలు ఆందోళన పడుతున్నారు. ఎం జరుగుతుందో అర్ధం కావడం లేదు జనాలకు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి 80 మందిని కలిసారని వైద్యులు, అధికారులు చెప్తున్నారు. మరి అంత మందినే కలిసాడా లేక అంతకంటే ఎక్కువ మందిని కలిసాడా అనేది తెలియదు.

అయితే కాస్త ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది. కరచాలనం చేయడానికి దూరంగా ఉండండి. ఏదైనా అనారోగ్యంగా అనిపించినా, జలుబు వచ్చినా, కాస్త జ్వరంగా అనిపించినా, గాలి పీల్చుకునే సమస్య వచ్చినా సరే వెంటనే వైద్యులను సంప్రదించండి. బయట కాస్త వేడిగా ఉంది కాబట్టి ఏసీ లు వేసుకుంటారు. అనారోగ్యం ఉన్న వాళ్ళు అసలు ఏసీ లో ఉండకండి.

మీది ఇంట్లో వాళ్లకు కూడా అంటే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నాలుగు రోజులు కనీస జాగ్రత్తలు తీసుకోండి. నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలను తినకండి. ఏది తిన్నా సరే కాస్త వేడి చేసుకుని తినాల్సిన అవసరం ఉంది. అనవసరంగా బయటి ఆహారాన్ని కూడా తీసుకోవద్దు. మాస్క్ లు ధరించండి. ఎక్కువ మంది ఉన్న చోట ఉండకండి. హగ్ లు, కిస్ లు అవసరం లేదు. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news