బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు సులువుగా చెక్ పెట్టండిలా..

-

ప్ర‌స్తుత స‌మాజంలో 80 శాతం గుండె జ‌బ్బులతో బాధ‌ప‌డుతూ చ‌నిపోతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం హై కొలెస్ట్రాల్. అది కంట్రోల్‌లో ఉంటే ఏమీ కాదు. కానీ ఆ కొవ్వు పెరిగితేనే చాలా ఇబ్బందులు పాడాల్సి వ‌స్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వచేరడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ నీటితో కరగదు, మరియు ఇది రక్తనాళాల్లోకి చేరడం వల్ల శరీర ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది. మామాలు కొవ్వు ఉంటే అంత ప్రమాదం లేదుగానీ చెడు కొవ్వు ఉన్న ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతుంటారు. అయితే దీనికి ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

– తులసిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తొలగించి, గుడ్ కొలెస్ట్రాల్ ను ప్రోత్సహించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. అల్సర్ వంటి సమస్యలను కూడా నివారిస్తుంది.

– ద్రాక్షలో పొటాషియం ఎక్కువగా ఉండ‌డం వ‌ల్ల బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

–  కొత్తిమీర శరీరంలో టాక్సిన్స్ ను బయటకు తొల‌గించ‌డానికి సహాయపడుతుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ఎక్సెస్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

– ఆహారంలో రెగ్యులర్ గా వెల్లుల్లి తీసుకుంటేచాలా మంచిది. వెల్లుల్లిలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించేస్తాయి.

– రోజూ గ్రీన్ టీ తాగితే బ్యాడ్ కొలెస్ట్రాల్ సులువుగా త‌గ్గించుకోవ‌చ్చు. గుండె జ‌బ్బుల నివార‌ణ‌కు కూడా ఎంతో గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

– హై కొలెస్ట్రాల్ నివారించడంలో కోకనట్ ఆయిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు. రెగ్యులర్ డైట్ లో కొంత కోకనట్ ఆయిల్ ను చేర్చుకుంటే చాలా మంచిది.

– పసుపులో యాంటీ ఇన్ల్ఫ‌మేటరీ లక్షనాలు పుష్కలంగా ఉన్నాయి. పసుపు ఇది ఒక ఎఫెక్టివ్ ఏజెంట్. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ప‌సుపు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version