డయాబెటిస్, గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్.. వంటివి ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. చాలా మంది ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఇక ఈ జాబితాలో మరో కొత్త వ్యాధి కూడా వచ్చి చేరింది. అదే.. ఫ్యాటీ లివర్ సమస్య. గతంలో మద్యం సేవించే వారికే ఈ సమస్య ఎక్కువగా వస్తుందని భావించేవారు. కానీ మద్యం సేవించకపోయినా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందికి వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.
అధికంగా బరువు ఉండడం, ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటిస్, రోజూ గంటల తరబడి కూర్చుని పనిచేయడం, గుండె జబ్బులు, హెపటైటిస్ సి, రీఫైన్ చేయబడిన కార్బొహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవడం, జీర్ణ సమస్యలు.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య వస్తోంది.
ఈ సమస్య వచ్చిన వారిలో శరీరంపై ఎక్కడ చూసినా దురదలు వస్తుంటాయి. పొట్ట భాగంలో ఉబ్బినట్లు కనిపిస్తుంది. మబ్బుగా, మగతగా ఉంటారు. మాటలు తడబడుతుంటాయి. ఆకలి ఉండదు. తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. చిన్న పనికే బాగా అలసిపోతారు. చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది.
* నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవాలంటే రోజూ వేడి నీళ్లకు బదులుగా చన్నీళ్ల స్నానం చేయాలి.
* ఎండలో ఎక్కువ సేపు తిరగరాదు.
* వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. బిగుతుగా ఉండే వస్త్రాలను ధరించరాదు.
* రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు, చక్కెరలను తగ్గించాలి. అన్ని పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. వేళకు భోజనం చేయాలి. త్వరగా నిద్రించి త్వరగా మేల్కొనాలి.
* రోజూ కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
ఈ సూచనలు పాటిస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.