One-Sided Relationship : మీ ప్రేమ కూడా ఇలానే ఉందా..? అయితే ఇది పక్కా వన్ సైడ్ లవ్వే..!

-

ప్రేమ ఎప్పుడూ ఇద్దరూ మనసుల నుంచి రావాలి. ఎప్పుడూ ఒకరే ప్రేమిస్తూ ఉంటే అది ప్రేమ కాదు. అది వన్ సైడర్ రిలేషన్షిప్ మాత్రమే. చాలామంది ప్రేమలో ఉన్నామని వాళ్లు కూడా ప్రేమిస్తున్నారని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకరే ప్రేమిస్తూ ఉంటారు. ఇంకొకరు కేవలం ప్రేమలో ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. అలాంటి రిలేషన్షిప్ వలన ఉపయోగం లేదు. వీలైనంత వరకు ఇలాంటి రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకోవడమే మంచిది. మీరు కూడా వన్ సైడ్ రిలేషన్షిప్ లో ఉన్నారని సందేహంగా ఉందా..? అయితే కచ్చితంగా ఇలా తెలుసుకోవచ్చు. మీ ప్రేమ ఇలా ఉంటే కచ్చితంగా అది వన్ సైడ్ ఏ.

ఎప్పుడూ సహాయం చేయకపోవడం:

హెల్ది రిలేషన్షిప్లో ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరికొకరు సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. ఒకరు సమస్యల్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు సహాయం చేస్తారు. అదే ఒకవేళ ఎప్పుడూ ఒకరే హెల్ప్ చేస్తూ మరొకరి నుండి రెస్పాన్స్ రాకపోతున్నట్లయితే కచ్చితంగా అది వన్ సైడ్ అని తెలుసుకోవాలి.

ఒత్తిడితో ఉండడం:

యాంగ్జైటీ, డిప్రెషన్ తో పాటుగా ఎమోషనల్ గా ఇబ్బంది పడడం వంటివి కనపడుతున్నట్లయితే కచ్చితంగా అది వన్ సైడ్ అని తెలుసుకోవాలి. నిజంగా ఇద్దరు ప్రేమిస్తున్నట్లయితే ఆనందంగా ఉంటారు.

చెడు అలవాట్లు దాచేయడం:

కొంతమంది పార్ట్నర్ కి తెలియకుండా డ్రగ్స్ తీసుకోవడం లేదా స్మోకింగ్ డ్రింకింగ్ వంటివి చేస్తూ ఉంటారు. నిజమైన ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఎప్పుడూ కూడా వారి యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ని దాచరు. పార్ట్నర్ తో చెప్తారు.

ఫిజికల్ ఎఫెక్షన్ లేకపోవడం:

సెక్స్ పట్ల తక్కువ చూపించడం లేదా కలవడానికి రాకపోవడం లేదంటే అసలు అర్థం చేసుకోకపోవడం వంటివి వన్ సైడ్ రిలేషన్షిప్ కి సంకేతాలని చెప్పొచ్చు. ఇలాంటి రిలేషన్ షిప్ లో ఉండడం కంటే ఆ రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకోవడమే మంచిది

Read more RELATED
Recommended to you

Latest news