మార్కెట్ లోకి వెళ్తే చాలు చాలా మందు పండ్లు కొనే ముందు అన్ని తెలిసినవి మన కళ్ళ ముందు రోజు కనపడేవి, రుచి కరంగా ఉండేవి మాత్రమే కొంటారు. వేరేవి చూడండి సామి అని చెప్పినా వినరు అంటే వినరు. మార్కెట్ లో దొరికే ప్రతీ పండు కూడా మన ఆరోగ్యానికి ఉపయోగమే. లేకపోతే ఎందుకు అమ్ముతారు చెప్పండి…? ఎందుకు పండిస్తారు చెప్పండి. చాలా మంది లైట్ తీసుకునే పండు పియర్ పండు.
రుచి బాగోదని కొందరు, అది మన దేశం పండు కాదని కొందరు వదిలేస్తారు. కాని ఆ పండు వలన చాలా ప్రయోజనాలు ఉంటాయట. అవును నిజం, పియర్స్ పండ్లను తరచూ తినడం వల్ల స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు 52 శాతం తక్కువగా ఉంటాయని వైద్యులు చెప్పడమే కాదు పరిశోధనల్లో కూడా వెల్లడైంది. అందులో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది అని చెప్తున్నారు.
డచ్ పరిశోధకులు దీని మీద పరిశోధనలు చేసి ఆ విషయాన్ని బయటపెట్టారు. ఈ పండు తినడం వలన మలబద్ధక సమస్యకు ఇక గుడ్ బాయ్ చెప్పవచ్చని అంటున్నారు. అంతే కాదు ఇంకా ఉన్నాయి, దంతాల, ఎముకల, పుతుకలో లోపాలు, రక్త హీనత సమస్య ఉన్న వారు వాటిని తింటే ఆ సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉంటాయట. ఇంకో విషయ౦, వృద్దాప్యం త్వరగా కనపడదని చెప్తున్నారు.