పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదా..? అయితే ఈ ఇంటి చిట్కాని అనుసరిస్తే సరి…!

చాలా మంది మహిళలు ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే దీని వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తే కడుపు నొప్పి కలగడం, బ్లోటింగ్, గ్యాస్, క్రామ్ప్స్ మొదలైన సమస్యలు వస్తాయి.

అందుకని ఎప్పుడూ కూడా పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోతే అశ్రద్ధ చేయకండి. ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే కూడా పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. అయితే ఈ ఇంటి చిట్కాలని కనుక మీరు పాటించారంటే కచ్చితంగా పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. అలాగే ఎటువంటి సమస్యలు కూడా రుతుస్రావం సమయంలో రావు. ఈ విధంగా మీరు డ్రింక్ ని తయారు చేసుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

కావలసిన పదార్థాలు:

తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు ఒక టీస్పూన్
ఎండిన అల్లం ఒక టీస్పూన్
బెల్లం ఒక టీస్పూన్
నీళ్లు ఒక గ్లాసు

తయారు చేసుకునే పద్ధతి:

ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని అందులో నువ్వుల్ని, అల్లం పొడిని వేయాలి. దీనిని మరిగించి సగం అయ్యాక అందులో బెల్లం వేయాలి. బెల్లం బాగా నీళ్ళలో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని వడకట్టి తాగాలి. మీ పీరియడ్ డేట్ కి ఒక వారం ముందు ఇలా అనుసరిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి.