వృద్ధాప్యంలో ఆరోగ్యం కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈ సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్స్, లో పొటాషియం ఒకేలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని కణాల పనితీరును మెరుగుపరచడంతో పాటు, గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణలో, కండరాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. వృద్ధులకు పొటాషియం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు మనము తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యానికి పొటాషియం : పొటాషియం గుండె స్పందనలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వయసు పైబడిన వారిలో గుండె సంబంధిత సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి. అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ వల్ల గుండెకి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అలాంటివారికి పొటాషియం ఎంతో కీలకం. ఇది రక్తనాళాలను సడలించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మనం తినే ఆహార పదార్థాలలో అరటిపండు, ఆరెంజ్, బంగాళదుంప, పాలకూర వంటి ఆహారాలు పొటాషియం ను అందిస్తాయి.
కండరాలు నరాల పనితీరు: వృద్ధాప్యంలో కండరాల బలహీనత నరాల సమస్యలు అధికంగా వస్తాయి. వయసు పైబడిన వారిలో ఇది సర్వసాధారణ సమస్యగా పరిగణించవచ్చు. కాళ్లు, చేతులు కండరాలు పట్టేయడం నొప్పి రావడం వంటివి జరుగుతుంది. పొటాషియం కణాలలో ఉండే నొప్పులని, తగ్గిస్తుంది. కండరాల తిమ్మిరి,వాపులను నివారిస్తుంది.
రక్తంలో ఉప్పు, నీటి శాతం : వయసు పైబడిన వారిలో రక్త పోటు ఎక్కువగా ఉంటుంది. హై బీపీ వలన ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పొటాషియం శరీరంలోని సోడియం స్థాయిని సమతుల్యం చేస్తుంది. అధిక సోడియం వల్ల శరీరంలో నీరు నిలిచిపోతుంది, రక్తపోటు పెరుగుతుంది. పొటాషియం సోడియం యొక్క ప్రభావాన్ని తగ్గించి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది వృద్ధాప్యంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ను నివారించడంలో సహాయపడుతుంది.
ఎముకల ఆరోగ్యం: ఒక వయసు వచ్చిన తర్వాత, మనం ఎక్కువసేపు కూర్చున్న ఎక్కువసేపు ఏదైనా పని చేస్తే చేతులు, కాళ్లు నొప్పులు వస్తుంటాయి. ఎముకలన్నీ బలహీన పడినట్లు, నొప్పులుగా ఉంటాయి. పొటాషియం శరీరంలో ఆమ్లా- క్షార సమతల్యతను కాపాడుతుంది. ఎముకల నుండి క్యాల్షియం కోల్పోకుండా చేస్తుంది. తద్వారా ఎముకల సమస్యలను నివారించవచ్చు. ఎక్కువగా ఈ సమస్య వయసు పైబడిన మహిళల్లో కనిపిస్తుంది.
అయితే పొటాషియం అధికంగా తీసుకోవడం కూడా హానికరం కావచ్చు, ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వైద్యుడు సలహా మేరకే పొటాషియం సంబంధించిన ఆహారాలను తీసుకోవాలి. పొటాషియం ఎక్కువైతే కిడ్నీ ప్రాబ్లమ్స్,హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి.అందుకే ముందు పొటాషియం లెవెల్స్ ను చెక్ చేసుకోవటం ముఖ్యం.