లైంగిక సమ్మతికి వయోపరిమితిని 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పైన కేంద్రం రియాక్ట్ అయ్యింది. లైంగిక సమ్మతికి 18 ఏళ్లు తప్పకుండా దాటాల్సిందేనని స్పష్టం చేసింది. మైనార్టీ తీరని వారిని లైంగిక మోసాల నుంచి కాపాడుకునేందుకు బాగా ఆలోచించి ఈ నిర్ణయం అమలు చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. యువతి యువకుల మధ్య శృంగార భరిత ప్రేమ పేరుతో ఈ పరిమితిని తగ్గించడం చాలా ప్రమాదకరం అంటూ కేంద్రం చెప్పింది.

తగ్గిస్తే పిల్లలపై అక్రమ రవాణా, బాలలపై నేరాలు పెరుగుతాయని కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే నేటి కాలంలో చిన్న పిల్లలపై అఘాయిత్యాలు, హత్యలు చాలా జరుగుతున్నాయని ఇకనుంచి అలాంటి వాటిని అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపడతామంటూ కేంద్రం స్పష్టం చేసింది. నేటి కాలంలో చాలామంది చిన్నపిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా హత్యలు చేయడం, లైంగిక దాడులకు పాల్పడడం చాలా కామన్ అయిపోయింది. ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు తీవ్రస్థాయిలో వేడుకుంటున్నారు.