సహజంగా ఆరోగ్యంతో పాటుగా చాలా శాతం మంది వయసు పెరిగే కొద్దీ బరువు మరియు ఇతర విషయాల పై శ్రద్ధ ఎక్కువగా చూపుతారు. ముఖ్యంగా అధిక బరువు ఉండటం వలన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఉబకాయం వంటి ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కనక వయసు పెరిగే కొద్దీ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి మరియు తరచుగా బరువును చూసుకుంటూ ఉండాలి. సహజంగా 12 నుండి 18 ఏళ్ల మధ్యలో శారీరక అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. దాని వలన శారీరిక మార్పులు జరుగుతాయి. అయితే ఈ వయసులో అమ్మాయిలు మరియు అబ్బాయిలు కూడా వేగంగా బరువు పెరుగుతారు.
18 ఏళ్ల నుంచి ఎత్తు మరియు బరువులో స్థిరమైన మార్పును ఎదుర్కొంటారు. ఎప్పుడైతే 18 నుండి 25 ఏళ్ల వయసులో ఉంటారో వయసు మరియు ఎత్తు ప్రకారం బరువును కూడా నియంత్రించుకోవాలి. ఎవరైతే 18 నుండి 25 వయసు వారు ఉంటారో మరియు 150 నుండి 155 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నవారు 47 నుండి 60 కేజీల వరకు బరువు ఉండవచ్చు. అదేవిధంగా ఇదే వయస్సు వారు 160 నుండి 165 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నట్లయితే 53 నుండి 66 కేజీల బరువు ఉండవచ్చు. 170 నుండి 175 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నట్లయితే 58 నుండి 72 కేజీల వరకు బరువు ఉండవచ్చు.
వయసు పెరిగిన తర్వాత 26 నుండి 35 సంవత్సరాల గలవారు 150 నుండి 155 సెంటీమీటర్లు ఎత్తు ఉన్నవారు 50 నుండి 63 కేజీల వరకు ఉండవచ్చు. ఇదే వయసు వారు 160 నుండి 145 సెంటీమీటర్లు ఎత్తు ఉన్నట్లయితే 55 నుండి 70 కేజీల వరకు బరువు ఉండొచ్చు. 170 నుండి 175 ఎత్తు ఉన్నవారు 60 నుండి 75 కేజీల బరువు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. కనుక వయస్సు మరియు ఎత్తు ప్రకారం బరువుని తప్పకుండా నియంత్రణలో ఉంచుకోవాలి మరియు ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.