తామరను నాచురల్గా ఇలా తగ్గించుకోవచ్చు.. ఈ డైట్ తో సమస్య మాయం..!

-

కొంతమందికి తామర ఇబ్బంది పెడుతుంది. రకరకాల మందులు వాడినప్పుడు తగ్గుతుంది కానీ.. మళ్లీ వస్తుంది. మనం ఈరోజు అసలు ఇది ఏ క్రిమి ద్వారా వస్తుంది, అంటువ్యాధి కాబట్టి ఇంట్లో వాళ్లు ఎలా జాగ్రత్త పడాలి, నాచురల్గా తగ్గించుకోవడానికి బాహ్యంగా ఏం రాయొచ్చు, ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి, భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం..!
రింగ్ వార్మ్ అనేది ఫంగస్ క్రిమి వల్ల వస్తుంది. చర్మంపై రౌండుగా వస్తుంది కాబట్టి దీన్ని రింగ్ వార్మ్ అంటారు. గాలి ఆడని భాగాల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. నడుము, చంకలు, ప్రైవేట్ పార్ట్స్ లో ఎక్కువ వస్తుంది. తామర తగ్గించుకోవడానికి ఇంట్లో వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. వారికి దూరంగా ఉండాలి. కోవిడ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా అయితే.. వారిని దూరంగా పెట్టి ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారో..తామర వచ్చినప్పుడు కూడా అలానే చేయాలి.
తామరను నాచురల్గా తగ్గించుకునే పద్దతి:
వేపాకు తీసుకుని పేస్ట్ చేసి.. పసుపు కలిపి తామర మీద అప్లైయ్ చేస్తే నాచురల్గా దురద, ఎరుపు తగ్గడానికి ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతంగా పనికొస్తుంది. నిల్వ ఉంచుకోకుండా..ఫ్రష్ గా ఎప్పటికప్పుడు చేసుకుని మంచి క్వాలిటీ ఉన్న పసుపునే వాడాలి. ఒక గంటసేపు ఉంచుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తుండాలి.
స్నానం చేసిన తర్వాత కొబ్బరినూనె రాస్తే..దురద తగ్గుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ లేదా టీ ట్రీ ఆయిల్ కూడా తామర ఉన్న ప్రదేశంలో స్నానం చేసిన తర్వాత అప్లై చేసుకోవచ్చు.
ఎలాంటి వాటర్ తీసుకోవాలి..?
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు చెప్పిన సూచనల ప్రకారం.. మీకు అప్పటికే అలవాటు ఉంటే.. 4-6రోజులు హనీ వాటర్ ఫాస్టింగ్ చేయండి. కొబ్బరి నీళ్లు, తేనె నీళ్లు మీదే ఉండాలి. 5రోజులు తర్వాతా మళ్లీ 15రోజులు పాటు.. జ్యూస్ ఫాస్టింగ్ చేయాలి. ఒక వేళ మీద జ్యూస్ ఫాస్టింగ్ చేయలేకపోతే..ఫ్రూట్స్ ఫాస్టింగ్ చేయొచ్చు. మూడు పూట్ల పండ్లే తిని ఉండాలి. జ్యూస్ ఫాస్టింగ్ లో ఉదయం 8 గంటలకు ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగితే 11కి ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్, 1కి మిక్సిడ్ ఫ్రూట్స్ జ్యూస్, ఈవినింగ్ 5కి చెరుకు రసం, 7గంటలకు ఇంకేదైనా జ్యూస్ ఇలా జ్యూస్ ఫాస్టింగ్ చేయాలి. ఇలా తేనే వేసుకుని తీసుకుంటే.. ఇలా చేయడం వల్ల బాడీలో రక్షణ వ్యవస్థ బాగా యాక్టీవేట్ అయి.. హీలింగ్ బాగా ఎక్కువ స్పీడ్ గా జరుగుతుంది. నైట్ 7 దాటాక..ఏం తీసుకోవద్దు. ఇలా చేయడం ద్వారా..తామర మాత్రమే కాదు.. వెయిట్ తగ్గుతారు, లివర్ డీటాక్సిఫికేషన్ అవుతుంది. లివర్ లో ఉండే టాక్సిన్స్ అన్నీ వెళ్లిపోతాయి. బ్లడ్ ప్యూరిఫికేషన్ అవతుంది. ఒక మంచి ఆహార నియమాలు పాటించడం ద్వారా ఇవన్నీ లాభాలే.
తగ్గిన తర్వాత ఏం చేయాలి..?
తామర మళ్లీ ఇక రాకూడదు అంటే.. తగ్గిన తర్వాత.. స్నానం రెండూపూట్ల చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు బాగా గాలి ఆడే వస్త్రాలే వేసుకోవాలి. టైట్ గా ఉండేవి ధరించడం తగ్గించాలి. బాడీని బాగా క్లీన్ చేసుకోవాలి. నాచురల్ ఫుడ్స్ తీసుకోవడానికే ప్రయత్నించండి. నైట్ 7 తర్వాత ఏం తినకుడదు. ఎర్లీ డిన్నర్ ఆరోగ్య లక్షణం.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version