ప్రపంచంలో వింతరోగాలు విలయతాండవం చేస్తున్నాయి. కొవిడ్ నేర్పిన పాఠంతో ప్రజల్లో, ప్రభుత్వాల్లో మార్పులు వచ్చాయి. వచ్చిన వింతరోగాలను ఎలాగోలా ముందే పసిగట్టి కొంతమేర ఆపగలుగుతున్నారు.. ఇప్పుడు అమెరికా, యూరప్‌లో సాల్మొనెలోసిస్ అనే వ్యాధి విస్తరిస్తోంది. అమెరికా, ఐరోపాలో 150 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది.
ఒక నెల క్రితం UKలో సాల్మొనెల్లా టైఫిమూరియం కేసులను గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా పిల్లలు, వృద్ధులలో డీహైడ్రేషన్ సమస్య బాగా ఉంటుంది. ఇజ్రాయెల్ ఆహార తయారీదారు తన ప్లాంట్‌లో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు తెలియడంతో ఉత్పత్తులని నిలిపివేసిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తన నివేదికలో పేర్కొంది.
సాల్మొనెలోసిస్ అంటే ఏంటి..?
సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ అంటే సాల్మొనెలోసిస్ అనే బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఇది మనిషి ప్రేగులను ప్రభావితం చేస్తుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిన వ్యక్తి ముట్టుకున్న నీటిని తాగడం, లేదా ఆహారం తినడం ద్వారా లేదా కలుషితమైన ఆహారం తీసుకోవడం ద్వారా
ఇతరులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ ఎనిమిది గంటల నుంచి మూడు రోజులలోపు ఉంటుంది. దీనివల్ల జ్వరం, అతిసారం, కడుపు నొప్పి ఉంటుంది. కొంతమందిలో లక్షణాలు అస్సలు కనిపించకపోవచ్చు..
జంతువులు కూడా..
మనుషులే కాకుండా జంతువులు, పక్షుల ప్రేగులలో కూడా సాల్మొనెల్లా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఈ పరిస్థితిలో తక్కువగా ఉడికించిన చికెన్, మటన్, గుడ్లు ఉత్పత్తులు తినడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది.
వ్యాధి లక్షణాలు..
తలనొప్పి, జ్వరం. వికారం, వాంతులు, చలి, కటి నొప్పి, అతిసారం, మలంలో రక్తం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు గుర్తించారు.
ఎక్కడో అమెరికాలో ఉంది కదా మనం లైట్ తీసుకోవచ్చు అనుకుంటున్నారేమో.. కరోనా కూడా చైనా నుంచే వచ్చింది.. తొలినాళ్లలో.. ఎవరూ ఎక్కడో కరోనా మన ఇంటి వరకు వస్తుందని ఊహించలేదు. కానీ అది ఎంత బీభత్సం చేసిందో మనకు తెలుసు.. కాబట్టి.. జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు.