పట్నం మహేందర్ రెడ్డి ఇఫ్తార్ విందును బహిష్కరించిన పోలీసులు

-

మాజీ మంత్రి ప్రస్తుత టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి..తాండూరు సి ఐ రాజేందర్ రెడ్డి ని అసభ్య పదజాలంతో దూషించిన ఆడియో రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వర స్వామి జాతరలో స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గీయులకు రెడ్ కార్పెట్ వేయడంపై మహేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు.రెడ్ కార్పెట్ ఎందుకు వేశారు అంటూ కోపంతో ఊగిపోయిన టిఆర్ఎస్ నేత ..అసభ్య పదజాలంతో సీఐపై విరుచుకుపడ్డారు.గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పైలెట్ రోహిత్ రెడ్డి అధికార టీఆర్ఎస్ లో చేరారు.అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు నెలకొంది.

అయితే మొన్న సీఐ ని తిట్టడంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మహేందర్ రెడ్డి కి ఎస్కార్ట్ భద్రత కల్పించలేమని పోలీసులు తెలిపారు.వారం క్రితమే ఇఫ్తార్ విందుకు మహేందర్ రెడ్డి ఆహ్వానాలు పంపారు.అయితే మొన్నటి వరకు మహేందర్ రెడ్డి కి ఎస్కార్ట్ తో భద్రత కల్పించారు పోలీసులు.ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే విడివిడిగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఇవాళ తాండూరులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇస్తున్నారు.అయితే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇఫ్తార్ విందుకు దూరంగా ఉన్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version