మోకాళ్ల నొప్పులకు శాండ్ బాత్ చక్కటి పరిష్కారం.. ఇలా చేయడం మాత్రం మర్చిపోవద్దే..!

-

ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ కు వెళ్లినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం.. ఒక స్టేజ్ లో అయితే.. మనలో ఒకడ్ని ఇసుకలో పడుకోపెట్టి మొత్తం ఇసుక కప్పేసి చిల్లర చిల్లర చేస్తాం కదా.. ఇది మనం ఎంజాయ్ మెంట్ కోసం చేస్తాం కానీ.. దీన్నే శాండ్ బాత్ అంటారు. స్టీమ్ బాత్, సన్న బాత్ లా శాండ్ బాత్ కూడా ఒకటి. ఇతర దేశాల్లో ఇది బాగా చేస్తారు. మన దగ్గర ఎండ అదిరిపోతుంది కాబట్టి చాలా అరుదుగా చేస్తారు. ఈరోజు మనం శాండ్ బాత్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం. కుదిరినప్పుడు చేసుకోవచ్చు కదా..!
శాండ్ బాత్ అనేది ఎప్పటి నుంచే ప్రకృతి వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఇసుక ఎండకు వేడెక్కుతుంది. దాన్ని తల ఒక్కటి బయటకు పెట్టి బాడీ అంతా కప్పేస్తారు. ఇలా కప్పేయడం వల్ల ఆ వేడికి మన ఒంట్లో ఉన్న నొప్పులన్నీ లాగేస్తాయి. బాడీకి మంచి రీఫ్రష్. బాడీకీ చెమట బాగా పడుతుంది. స్కిన్ లో టాక్సిన్స్ అన్నీ తగ్గుతాయి. బాడీ డీటాక్సిఫికేషన్ కు శాండ్ బాత్ బాగా పనిచేస్తుంది.
శాండ్ బాత్ ఎలా చేయాలి..?
మోకాళ్ల నొప్పులు, కాళ్లనొప్పులు ఉన్నవారు ఇలాంటి శాండ్ బాత్ ను చేస్తుంటే…మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంట్లో ఇసుకను ఉంచుకుంటే.. కుదిరినప్పుడల్లా చేయొచ్చు. అయితే శాండ్ బాత్ చేసే ముందు పొట్టనిండా వాటర్ తాగాలి. ఎందుకంటే..ఆ వేడికి బాడీ డీ హైడ్రేట్ అయి విపరీతంగా చెమట పడుతుంది. కాబట్టి కడుపు నిండా నీళ్లు తాగి..మగవారు అయితే..ఇన్నర్ వేర్ తో చేసేయొచ్చు. తలభాగం బయటకు పెట్టేసి.. బాడీ అంతా ఇతరుల సాయంతో కప్పివేయించుకోవాలి. తలమీద తడిక్లాత్ వేసుకోవడం కూడా మర్చిపోవద్దు. లేదంటే తలకు రక్తప్రసరణ జరగదు. 20-25 నిమిషాలు పాటు ఉండి.. బాడీలో వేడి చల్లరానితర్వాత అంటే ఓ పది నిమిషాలు ఆగి..అప్పుడు చల్లని నీటితో స్నానం చేస్తే సూపర్ ఫీల్ ఉంటుంది. ఆ వేడిమీద అస్సలు స్నానం చేయకూడదు.
మోకాళ్ల నొప్పులు ఉన్నవారు సీటు భాగం వరకూ ఇసుకను వేసుకుని కుర్చోవచ్చు. ఇలా కూడా 20నిమిషాలు ఉండి స్నానం చేయొచ్చు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి.
పెయిన్స్ పెయిన్ కిల్లర్స్ వాడితే తగ్గుతాయి కానీ.. వాటి ఎఫెక్ట్ దీర్ఘకాలం ఉంటుంది. ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీలు దెబ్బతింటాయి. శాండ్ బాత్ ను బీచ్ కు వెళ్లినప్పుడే కాదు.. ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. పెద్ద ఖర్చు కూడా ఉండదు. మంచి ప్లేసు చూసుకుని వీకెండ్స్ లో ట్రే చేయొచ్చు. అయితే ఇసుక మరీ వేడి అయ్యేంత వరకూ ఉండొద్దు. దానివ్లల చర్మంపై దుద్దర్లు, మంట రావొచ్చు. మరీ సెన్సిటీవ్ స్కిన్ అయితే.. బట్టలు ఉంచుకునే ఇసుకులో ఉండొచ్చు.. కానీ క్లాత్ లేకుండా చేయడం వల్ల వేడి త్వరగా బాడీలోకి వెళ్తుంది. దానివల్ల మజిల్స్ త్వరగా రిలాక్స్ అవుతాయి.
చూశారు కదా.. శాండ్ బాత్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. ఈసారి బీచ్ కు వెళ్లినప్పుడు కుదిరితే ట్రే చేసేయండి మరీ..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news