నిశ్చితార్థం తర్వాత అమ్మాయి, అబ్బాయి ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి..లేదంటే

-

పెళ్లి అంటే..ఈరోజుల్లో… చేసుకునే వరకూ చేసుకోవాలి చేసుకోవాలి అనిపించి..చేసుకున్నాకా అప్పుడే ఎందుకు చేసుకున్నాం..కొంచె తొందరపడ్డాం.. కొన్నాళ్లు ఆగాల్సింది అనిపించే..ఒక క్రేజీ కమ్..మెమరబుల్ మూమెంట్. ఒక ఏజ్ వరకూ అందరూ పెళ్లి చేసుకోను అనే అంటారు. కానీ ఏళ్లు వచ్చేకొద్ది..ఎదురింటివాళ్ల ప్రశ్నలకు చిర్రెత్తిపోయి ఫైనల్ గా పెళ్లికి ఒప్పుకుంటారు. ఇప్పుడు దాదాపు అందరి పరిస్థితి ఇలానే అయిపోయింది. అయితే..ముహార్తాలు లేకో..మరో కారణం చేతనైనా..ఎంగేజ్ మెంట్ అయ్యాక..పెళ్లికి గ్యాప్ వస్తుంది.

ఇది ఒకరకంగా మంచి విషయమే..మీ ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాడనికి, ఒకరినొకరు అర్థంచేసుకోవడానికి, అభిరుచులు తెలుసుకోవడానికి మంచి టైం ..అరేంజ్ మ్యారేజ్ స్ లవ్ మ్యారేజ్ గా ఈ సమయంలోనే మారుతాయి. అయితే ఇది ఇంకోరకంగా చాలా కృషియల్ టైం అనే చెప్పాలి. పులిహోర కలపాలని ఏదిపడితే అది మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకునే నాలుగు విషయాలు అమ్మాయిలు, అబ్బాయిలు బాగా గుర్తుపెట్టుకోండి.

ఎక్కువ మాట్లాడవద్దు

పెళ్లి నిశ్చయమైన తర్వాత అబ్బాయి, అమ్మాయి గంటల తరబడి ఫోన్‌లో, వీడియో కాల్స్‌లో మాట్లాడుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు గమనించుకుంటారు. ఒక వ్యక్తి ఎక్కువగా మాట్లాడితే అవతలవ్యక్తి తప్పుగా భావిస్తారు. ఇద్దరిలో ఒకరి నోటి నుంచి ఏదో ఒక విషయం వస్తుంది అది వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి వివాహం పూర్తయ్యే వరకు మీ భాగస్వామితో తక్కువగా మాట్లాడండి. తక్కువగా కలవండి.

సంభాషణ గౌరవప్రదంగా ఉండాలి

మీ సంభాషణ, భాష, మాటలపై శ్రద్ధ ఉండాలి. అలాగే భాగస్వామికి పూర్తి గౌరవం ఇవ్వండి. పెళ్లయ్యాక ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం మీ బంధాన్ని ఇంకా మధురంగా ​​ఉంచుతాయి. కాబట్టి ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించకండి. ఒకరికొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అప్పుడే బంధం బాగుంటుంది. ఫ్రెండ్స్ ని పిలిచినట్లు ముందునుంచే పిలిస్తే..అవతలివారికి అది నచ్చకపోవచ్చు.

గొప్పలు చెప్పొద్దు

కొందరు వ్యక్తులు ఎదుటివారిపై ఆధిపత్యం చూపిస్తుంటారు. ఇతరులపై కూడా తమ ఆధిపత్యాన్ని చాటుతారు. వైవాహిక జీవితంలో ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వాములు అవుతారని గుర్తుంచుకోండి. ఇద్దరి స్థితి సమానంగా ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భాగస్వామిని అణచివేయడానికి ప్రయత్నించకూడదు. మీ అహంకారం మీ సంబంధంలో చీలికను తెచ్చిపెడుతుంది. ఒకరి కోరికలను ఒకరు గౌరవించండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్లు చెప్పేది వినండి..ముందే మీరు లొడాలొడా మాట్లాడకండి. అది చాలాసార్లు అవతలి వారికి చిరాకుగా అనిపిస్తుంది. మనం చెప్పేది వాళ్లు వింటున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా అని మనం తెలుసుకోవాలి. కొత్తకాబట్టి మీరు ఏం చెప్పినా మొఖం మీదే ఆపరాబాబు అనలేరు. వారి ముఖచిత్రాన్ని బట్టి మీరే అర్థంచేసుకోవాలి. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు.

కుటుంబం గురించి చెడుగా చెప్పకండి

అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఇద్దరూ వారి వారి కుటుంబ సభ్యులను గౌరవించాలని ఆశిస్తారు. అందువల్ల కుటుంబం గురించి ఎప్పుడూ చెడు మాటలు చెప్పకండి. అది ఎదుటి వ్యక్తికి చెడుగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ సంబంధం విచ్ఛిన్నమవుతుంది. ఒకరి కుటుంబం గురించి మరొకరు అడిగి తెలుసుకోండి కానీ..కుటుంబంలో వాళ్లను కించపరచటం కానీ. వాళ్ల గురించి మీరే చెడుగా చెప్పడం కానీ చేయొద్దు. వచ్చేవాళ్లు కూడా అలానే చూసే ప్రమాదం ఉంది.

మీరు ఇదే పరిస్థితిలో ఉంటే..వీటిని ఓసారి మైండ్ లో పెట్టుకోండి. బహుశా మీకు బాగా ఉపయోగపడొచ్చు ఏమో కదా..!

Read more RELATED
Recommended to you

Latest news