ఈ రోజుల్లో సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి శరీర నొప్పులు రావడం మనం చూస్తున్నాం. చిన్న పెద్ద తేడా లేకుండా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు మన జీవితంలో భాగమైపోయాయి. ఇక వీటినుంచి ఉపశమనం పొందడానికి చాలామంది పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ పై ఆధారపడతారు. కానీ ఇవి తాత్కాలికమైన ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి పైగా వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. దీనికి బదులుగా మనం ఆయుర్వేదంలో చెప్పబడిన కొన్ని సహజమైన పదార్థాలతో ఇంట్లోనే నొప్పి నివారణ తైలం తయారు చేసుకోవచ్చు. ఇక ఈ నూనె ఎలాంటి దుష్ప్రభావాలను లేకుండా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ నూనె ఏంటి అనేది చూద్దాం..
నూనె వల్ల కలిగే ప్రయోజనాలు : సహజమైన ఉపశమనం అందుతుంది ఇందులో వాడిన పదార్థాలు నరాల నొప్పిని, కండరాల నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాక మర్దన చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసన్న బాగా జరిగి రిలాక్స్ అవుతాయి, దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇది పూర్తిగా సహజమైన పదార్థాలతో తయారు చేయబడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు: నువ్వుల నూనె లేదా ఆవనూనె,వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 15
వాము గింజలు రెండు టీ స్పూన్లు,మెంతులు ఒక టీ స్పూన్, లవంగాలు5, యూకలిప్స్టిక్స్ ఆయిల్ 10 చుక్కలు.

నొప్పి నివారణ నూనె తయారీ విధానం : ముందుగా ఒక మందపాటి గిన్నెలో నువ్వుల నూనె లేదా ఆవనూనె తీసుకోవాలి. నూనెను సిమ్ లో ఉంచి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడెక్కాక అందులో వెల్లుల్లి రెబ్బలు, వాము మెంతులు, లవంగాలు వేయండి. ఈ పదార్థాలు నల్లగా మాడే వరకు లేదా బాగా నల్లగా వరకు వేయించండి. ఇవి బాగా మాడితేనే వాటిలోని గుణాలు నూనె లోకి పూర్తిగా ఇంకుతాయి. పదార్థాలన్నీ మాడిన తర్వాత మంటను ఆపి నూనెను చల్లార్చనివ్వండి. నూనె పూర్తిగా చల్లారాక ఒక సన్నటి వస్త్రం లేదా జల్లెడ సహాయముతో ఆ నూనెని వడకట్టండి. చివరగా యూకలిప్స్టిక్స్ ఆయిల్ ను కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేయండి
నూనె ఎలా వాడాలి: ఈ నూనెను నొప్పి ఉన్న ప్రదేశంలో కొద్దిగా తీసుకొని సున్నితంగా మర్దన చేయాలి. కనీసం 15 నిమిషాల పాటు మద్యం చేయడం వల్ల రక్తప్రసన్న మెరుగుపడి నొప్పి తగ్గుతుంది. ఈ నూనె రోజుకు రెండు మూడు సార్లు వాడవచ్చు. ఈ నూనె కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు వెన్నునొప్పి మరియు ఒత్తిడి వల్ల వచ్చే నొప్పులను బాగా పనిచేస్తుంది.