ఈ బిజీ లైఫ్‌లో ఉదయాన్నే తలస్నానం చేయడానికి కూడా సమయం ఉండదు. అలాంటప్పుడు రాత్రి నిద్రించేముందు తలస్నానం చేస్తే ఓ పనైపోతుంది అనుకుంటారు. సమయం లేదని రాత్రులు తలస్నానం చేసి పడుకోవడం ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో తెలసుకొని పాటిద్దాం.
జుట్టు మరింత తెగిపోతుంది :
రాత్రుల్లో తలస్నానం చేసి పడుకొని నిద్రిస్తున్నప్పుడు అటు ఇటు మర్లుతుంటారు. ఆ సమయంలో తలకు అంటుకొని ఉన్న తలగడ, బెడ్‌కు వెంట్రుకలు అంటుకుంటాయి. మామూలు జుట్టుకంటే తడిజుట్టు ఎక్కువగా ఊడుతుంది.
జుట్టు అల్లికలు క్షీనిస్తాయి :
జుట్టు సరిగా ఆరకుండా పడుకున్న సమయంలో.. మీరు నిద్రపోయే విధానం వేర్వేరు ఆకృతలో ఉంటుంది. అలా ఉంటే మీ జుట్టు మరింత చిక్కుబడే అవకాశం ఉంది.
వెంట్రుకలు చిక్కు పడతాయి :
చాలామంది తలస్నానం చేసిన తర్వాత బిక్కు తీయరు. జnట్టు ఆరిన తర్వాతే చిక్కు తీస్తారు. ఇది సరైన పద్ధతే.. కానీ, రాత్రులు జుట్టు ఆరలేదని అలానే నిద్రపోతారు. దీంతో జుట్టు అటు ఇటు కదిలి ముద్దగా తయారవుతుంది. ఉదయానికల్లా ఉండచుట్టుకు పోతుంది.
తలలో ఫంగస్ అభివృద్ధి :
తడిజుట్టు, తలలో తేమతో అలాగే నిద్రపోవడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. తడిజుట్టు తేమ కారణంగా వేగంగా ఫంగల్ పెరుగుదలకు కారణమవుతుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే ఈ అవకాశం మరింత వేగంగా పెరుగుతుంది.
జలుబు లేదా అలెర్జీ రావొచ్చు :
రాత్రిసమయంలో తలస్నానం చేసుకోవడం వల్ల అలెర్జీల వంటి సమస్యలు పెరగడమే కాక, తలనొప్పి, తల భారానికి కూడా కారణమవుతుంది. తేమ కారణంగా తల చల్లగా ఉంటుంది. శరీరం వెచ్చగా ఉంటుంది. దీనివల్ల మైగ్రేన్, తలనొప్పి సమస్య కూడా తలెత్తుతుంది.
పరిష్కారం :
ఇటువంటి పరిస్థితుల్లో ఒకటే పరిష్కారం. రాత్రిపూట తలస్నానం చేయొద్దని చప్పము. కానీ, జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత దువ్వుకొని జడ వేసుకోవాలి. ఆ తర్వాతే నిద్రించాలి. జుట్టు చిక్కుపడకుండా ఉండాలంటే మంచి కండీషనర్, హెయిర్ సీరంను వాడండి.