డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు మరియు ముందు జాగ్రత్తలు..!

-

దీర్ఘకాలిక సమస్యలలో డయాబెటిస్ సమస్య కూడా ఎంతో ప్రమాదకరమైనది అని చెప్పవచ్చు. ఒక్కసారి జీవితంలో డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ సమస్య ఉంటే వారి పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతారు. పైగా జీవితాంతం మెడికేషన్ ను తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుకోవడానికి సరైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. తండ్రికి డయాబెటిస్ ఉంటే కూతురికి వచ్చే అవకాశం ఉందని వింటూ ఉంటాము. అయితే జన్యు శాస్త్రం ప్రకారం, డయాబెటిస్ సమస్య తల్లిదండ్రుల నుండి పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే కచ్చితంగా వస్తుందని చెప్పలేము అని నిపుణులు చెబుతున్నారు.

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం కుటుంబంలో టైప్ టు డయాబెటిస్ ఉంటే పుట్టే పిల్లలకు ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మరియు జీవన విధానంలో మార్పులు తీసుకోవడం అవసరం. సరైన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడం వలన వ్యాధి యొక్క ప్రమాదం తక్కువగా ఉంటుంది. జీవనశైలిలో మార్పులను చేయడంతో పాటుగా తీసుకునే ఆహారం పై ఎక్కువ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలను కూడా రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్ మరియు కూల్ డ్రింక్ లను ఎక్కువగా తీసుకోకూడదు. వీటితో పాటుగా వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రతిరోజు అరగంట నడవడం లేదా సైక్లింగ్ చేయడం వంటివి చేయాలి. ఇలా చేస్తే బరువును అదుపులో ఉంచుకోవచ్చు మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించుకోవచ్చు. ప్రారంభంలో డయాబెటిస్ కు సంబంధించిన లక్షణాలను ముందుగానే గుర్తించడం ఎంతో అవసరం. దాహం ఎక్కువగా వేయడం, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా పెరగడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే డయాబెటిస్ కు సంబంధించినవి అని గుర్తించాలి. డాక్టర్ ను సంప్రదించి డయాబెటిస్ ను తరచుగా చెక్ చేయించుకోవాలి. ముందు జాగ్రత్తలు మరియు జీవనశైలిలో మార్పులు చేయడం వలన డయాబెటిస్ ను నియంత్రించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news