ఎంతో ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఇవే..!

-

ఈ మధ్యకాలంలో ఎన్నో ప్రమాదకరమైన మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వాటిలో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఒకటి. ఆహారం, జీవనశైలి, వర్క్ ప్రెజర్ వలన చాలా శాతం మంది బ్రెయిన్ ట్యూమర్‌ ను ఎదుర్కొంటున్నారు. మెదడులో ఎప్పుడైతే గడ్డకట్టిన కణితి ఏర్పడుతుందో దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అని అంటారు. ఇది ఒక తీవ్రమైన వ్యాధి. దీనిని ఎదుర్కొంటున్నప్పుడు ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విపరీతమైన తలనొప్పిని ఎదుర్కొంటారు. అంతేకాకుండా వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా ఉంటాయి.

బ్రెయిన్ ట్యూమర్‌ ను ఎదుర్కొన్నప్పుడు దృష్టి, మాట, వినికిడి మారతాయి. ఎక్కువ రోజుల పాటు బ్రెయిన్ ట్యూమర్ ఉంటే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది మరియు గందరగోళానికి గురి అవుతారు. పైగా వినికిడి లోపం, తల తిరగడం, కాలు కదపలేకపోవడం వంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. దీంతో పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ ట్యూమర్ వంశపారంపర్యంగా వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే రేడియేషన్‌ కు ఎక్కువ గురవుతారో, వారికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కనుక మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి మరియు వీలైనంతవరకు రేడియేషన్‌కు దూరంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చేయడం వలన బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా ఎటువంటి పనులు జరగడం లేదు. కనుక వీలైనంతవరకు మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి. దీంతో పాటుగా రోజువారి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. సరైన జీవనశైలిని పాటిస్తూ రేడియేషన్‌కు దూరంగా ఉండటం వలన బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news